ప్రభుత్వాలను కదిలించే స్థాయికి ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాలను కదిలించే స్థాయికి ఉద్యమం

Sep 4 2026 7:29 AM | Updated on Sep 4 2026 7:29 AM

సూర్యాపేట : బుల్లెట్‌ రైలు సాధనే లక్ష్యంగా సూర్యాపేటలో జరుగుతున్న ఉద్యమం ప్రభుత్వాలను కదిలించే స్థాయికి చేరిందని మున్సిపల్‌ మాజీ చైర్మన్లు జుట్టుకొండ సత్యనారాయణ, పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. సూర్యాపేటకు బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రంలోని రైతుబజార్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం 19వ రోజు కొనసాగాయి. దీక్షను వారు ప్రారంభించి మాట్లాడారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఉద్యమం బుల్లెట్‌ ట్రైన్‌ వచ్చే వరకు కొనసాగుతుందన్నారు. దీక్షల్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు బొమ్మిడి లక్ష్మీనారాయణ, చల్లమల్ల నరసింహ, పేర్ల నాగయ్య, సలిగంటి వీరేంద్ర, పిండిగ నాగమణి, కందాల శంకర్‌రెడ్డి, వేల్పుల వెంకన్న, ఎల్లంల నరేష్‌, వల్లపుదాసు సాయికుమార్‌, వీరబోయిన రవి, షేక్‌ జహంగీర్‌, భయ్యా మల్లికార్జున్‌ యాదవ్‌, వజ్జా వీరయ్య, వెంకట్‌ యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

ఫ మున్సిపల్‌ మాజీ చైర్మన్లు

సత్యనారాయణ, పెరుమాళ్ల అన్నపూర్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement