సూర్యాపేట టౌన్ : మెడికల్ కళాశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిన జరుగుతున్న నియామకాలను పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఆదేశాల ప్రకారం కాంట్రాక్టు పద్ధతిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్ల నియామకాల కోసం గురువారం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. కౌన్సెలింగ్‌కు అభ్యర్థులు హాజరుకాని విభాగాల్లో వాక్–ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ జె.వి.డి.ఎస్.ప్రసాద్, జీజీహెచ్. సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, ఆర్‌ఎంఓలు పాల్గొన్నారు.


