జెడ్పీ సీఈఓ ఆకస్మిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ సీఈఓ ఆకస్మిక తనిఖీ

Sep 4 2026 1:54 AM | Updated on Sep 4 2026 1:54 AM

మోతె : మోతె మండల పరిధిలోని రాఘవాపురం గ్రామంలో జిల్లా పరిషత్‌ సీఈఓ శిరీష గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి, వీబీ జీ రామ్‌జీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ రికార్డులు, వీఓ భవనాన్ని ఆమె పరిశీలించారు. మండలంలోని ప్రతి గ్రామానికి అనుగుణంగా లేబర్‌ బడ్జెట్‌ను సిద్ధం చేయాలని పంచాయతీ కార్యదర్శులను, ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సందీప్‌ కుమార్‌, సర్పంచ్‌ మంజుల, పంచాయతీ కార్యదర్శి రేణుక, ఏపీఓ నగేష్‌, ఈసీ శ్రీహరి, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

పంట పొలాల పరిశీలన

నేరేడుచర్ల : నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్న గ్రామంలోని రైతు వల్లంశెట్ల కృష్ణయ్యకు చెందిన వరి పొలాన్ని గురువారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి విత్తనాలు వెదజల్లిన 15 నుంచి 20 రోజుల వ్యవధిలో మొలకలు ఎండిపోతున్నాయని రైతు కృష్ణయ్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పొలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. విత్తనాల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అని నిర్ధారించుకోవడానికి పంట నమూనాలను పరి శీలన నిమిత్తం ల్యాబ్‌కు పంపించినట్లు వెల్లడించారు. అలాగే విత్తనాలు విక్రయించిన దుకా ణదారుడు, కంపెనీ ప్రతినిధులు పంటలను పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆయన వెంట ఏఓ జావీద్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement