శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం

Sep 4 2026 1:54 AM | Updated on Sep 4 2026 1:54 AM

సూర్యాపేట టౌన్‌ : శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీస్‌ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ అన్నారు. గురువారం సూర్యాపేట పట్టణ పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌ పరిసరాలను నిశితంగా పరిశీలించి సిబ్బంది విధి నిర్వహణ తీరును, బాధితులకు అందుతున్న సేవలపై సమీక్షించారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ఉత్సవ కమిటీలతో శాంతి సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ తనిఖీలో పట్టణ సీఐ వెంకటయ్య, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ శివ కుమార్‌, ఎస్‌ఐలు సాయిరాం, రామచందర్‌, రహీముద్దీన్‌, పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సైబర్‌ భద్రతపై వినూత్న అవగాహన

సూర్యాపేట టౌన్‌ : గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవడంతో పాటు సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. గణేశ్‌ నవరాత్రుల సందర్భంగా జిల్లా ప్రజల్లో సైబర్‌ నేరాలపై మరింత అవగాహన కల్పించేందుకు ‘వినాయకుడు మనకు నేర్పే పాఠాలు–సైబర్‌ విజ్ఞానం కలిగి ఉండండి’ అనే సందేశంతో రూపొందించిన ప్రత్యేక సైబర్‌ అవగాహన పోస్టర్‌ను ఆయన గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు.

ఫ ఎస్పీ నరసింహ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement