బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి

Sep 4 2026 1:54 AM | Updated on Sep 4 2026 1:54 AM

బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి

సూర్యాపేట టౌన్‌ : వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌ లాల్‌ పవార్‌ ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పురుషుల, మహిళల ఓపీ గదులను సందర్శించి అవుట్‌పేషెంట్‌ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఏఎమ్‌సీ వార్డు, పీఎమ్‌జేఏవై, ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ పేషెంట్‌ రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌, డ్రగ్‌ స్టోర్‌ రూమ్‌, జనరల్‌ మెడిసిన్‌ డాక్టర్‌ గదిని తనిఖీ చేశారు. డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, మెడికల్‌ వార్డులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. మందుల కొరత లేకుండా బఫర్‌ స్టాక్‌ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్లు వాణి, జనార్దన్‌, అనిత, శ్రీలత, ఉపేందర్‌, యశ్వంత్‌, వినయ్‌ పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌ లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement