చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా కోర్టు పాంగణంలో ఈనెల 12న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద అన్నారు. బుధవారం సూర్యాపేటలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్, వెహికల్ యాక్టు, బ్యాంకు, విద్యుత్ వంటి కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. దీనిద్వారా ఇరుపక్షాల కక్షిదారులు గెలిచిన వారవుతారన్నారు. సమయం, డబ్బు వృథా కాకుండా ఉంటాయన్నారు. సూర్యాపేటతోపాటు, కోదాడ, హుజూర్‌నగర్, తుంగతుర్తి కోర్టుల్లో లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి శివరాం ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.భవ్య, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద


