సూర్యాపేట : బుల్లెట్ రైలు సాధించేదాకా మరో తెలంగాణ పోరును తలపించేలా సూర్యాపేటలో ఉద్యమం కొనసాగుతుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, డాక్టర్ రామ్మూర్తి అన్నారు. సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిలే నిరాహార దీక్ష బుధవారం 20వ రోజు తెలంగాణ మహిళా వేదిక సభ్యులు పాల్గొనగా వారు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఉద్యమాలతో ఏదైనా సాధించవచ్చన్నారు. సూర్యాపేట పట్టణ వ్యాపారులు, నాయకులు ధర్మార్జున్, పెద్దిరెడ్డి భారతమ్మ, రమణాచారి, మాజీ కౌన్సిలర్ ఊర గాయత్రి, చల్ల మల్ల నరసింహ, జర్నలిస్టు కందుకూరి యాదగిరి, పేర్ల నాగయ్య, బాలస్వామి, దేవయ్య, మహేశ్వరి, పగుళ్ల, వెంకన్న, తన్నీరు వాసు, రవి, పూల మాలలు వేసి దీక్షను ప్రారంభించారు. దీక్షలో తెలంగాణ మహిళా వేదిక మహిళలు వెలుగు వనిత, విజయమ్మ, చంద్రకళ, సుగుణ షామియా, జకిరా, ముంతాజ్ హలంబి లక్ష్మి, సుజాత , ధనమ్మ, రామలక్ష్మి, శ్యామల, శాహనాజ్, వనమ్మ, లక్ష్మమ్మ, ఉమాదేవి కూర్చున్నారు.


