బియ్యానికి దూరం | - | Sakshi
Sakshi News home page

బియ్యానికి దూరం

Sep 3 2026 8:35 AM | Updated on Sep 3 2026 8:35 AM

నెలరోజులు అవకాశం కల్పించినా..

18శాతం మంది..

భానుపురి (సూర్యాపేట) : మూడు నెలల సన్నబియ్యం కోటా ఇంకా మిగిలే ఉంది. ఇప్పటి వరకు 82 శాతం లబ్ధిదారులు తమకోటాకు సంబంధించి మూడు నెలల రేషన్‌ బియ్యాన్ని తీసుకెళ్లారు. కానీ వివిధ కారణాలతో 18 శాతం రేషన్‌ కార్డుదారులు బియ్యాన్ని తీసుకోలేదు. అయితే రేషన్‌ బియ్యం పంపిణీకి ఈనెల 5వ తేదీ వరకు గడువు ఉంది. ప్రతినెలా 75 నుంచి 80 శాతం మేర మాత్రమే రేషన్‌ పంపిణీ జరుగుతోంది. మూడు నెలలకు గాను మొదటగా నెలరోజుల పాటు, తదనంతరం ఈనెల 5వ తేదీ వరకు రేషన్‌ బియ్యం తీసుకెళ్లేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీలు కల్పించాయి. అయినా 82 శాతమే రేషన్‌ బియ్యాన్ని తీసుకోవడంతో మిగతా రేషన్‌ కార్డుదారులు కేవలం కార్డు కోసమే ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు.

3.72 లక్షల కార్డులు

జిల్లావ్యాప్తంగా 612 రేషన్‌ దుకాణాల పరిధిలో 3,72,658 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల ద్వారా 10,84,469 మంది లబ్ధిదారులు ప్రతినెలా రేషన్‌ బియ్యం పొందుతున్నారు. ఈ రేషన్‌ షాపుల ద్వారా గతంలో దొడ్డుబియ్యాన్ని పంపిణీ చేయగా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం సన్నబియ్యాన్ని అందిస్తుండడంతో పేదలు ఈ బియ్యాన్ని తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. జిల్లాలో ఉన్న రేషన్‌కార్డులు, లబ్ధిదారుల ఆధారంగా ప్రతినెలా 6,500 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మూడు నెలల (ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌) బియ్యాన్ని ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకే రేషన్‌ తీసుకెళ్లేందుకు వీలుంటుంది. అయితే మూడు నెలల రేషన్‌ కావడంతో ఆగస్టు నెలంతా లబ్ధిదారులకు డీలర్లు బియ్యం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు.

మూడు నెలల రేషన్‌ బియ్యం తీసుకెళ్లింది 82 శాతమే..

ఫ అన్ని రేషన్‌ దుకాణాల్లోనూ

నిల్వ ఉన్న బియ్యం

ఫ పంపిణీకి 5వ తేదీ వరకు గడువు

నెలరోజుల పాటు లబ్ధిదారులకు అవకాశం కల్పించినా.. ఇప్పటి వరకు 82 శాతం మాత్రమే పంపిణీ జరిగింది. జిల్లాలో ఉన్న 3.72 లక్షల మంది రేషన్‌కార్డు దారులకు గాను 3.12 లక్షల మంది రేషన్‌ కార్డుదారులు తమ మూడునెలల బియ్యాన్ని తీసుకెళ్లారు. జిల్లాలో రేషన్‌ కార్డు కలిగి ఇతర ప్రాంతాల్లో పోర్టబుల్‌ విధానంలో బియ్యాన్ని తీసుకున్న వారున్న.. ఇతర ప్రాంతాల్లో కార్డులు ఉండి.. ఇక్కడ రేషన్‌ తీసుకున్న వారితో సమానంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో మూడు నెలలకు సంబంధించి 20,642 మెట్రిక్‌ టన్నుల బియ్యం జిల్లాలోని 610 రేషన్‌ షాపులకు వెళ్లగా.. 60 వేల కార్డుదారులకు సంబంధించిన బియ్యం రేషన్‌ దుకాణాల్లోనే ఉంది. అయితే మిగిలిన రేషన్‌ కార్డుదారులు ఈనెల 5వ తేదీ వరకు తమ కోటా బియ్యాన్ని తీసుకెళ్లే వెసులుబాటు ఉండగా.. ఈ గడువును మరింత పొడిగించే సూచనలు ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement