సూర్యాపేటటౌన్ : బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్య పాలనపై బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రేవంత్‌రెడ్డి ఇచ్చిన మోసపూరిత హామీలతో రూపొందించిన 420 ఫీట్ల ఫ్లెక్సీతో పట్టణంలో వినూత్న రీతిలో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ శంకర్ విలాస్ సెంటర్ మీదుగా రాఘవ ప్లాజా, పీఎస్‌ఆర్ సెంటర్, పూల సెంటర్ మీదుగా, గాంధీ చౌరస్తా, తెలంగాణ తల్లి చౌరస్తా, మీదుగా కొత్త బస్టాండ్ వరకు కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ నాయకులు వై.వి, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గోపగాని వెంకటనారాయణ, అన్నపూర్ణ, జీడి భిక్షం, మహిళలు పాల్గొన్నారు.
ఫ బీఆస్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
బడుగుల లింగయ్య యాదవ్
ఫ కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్య పాలనపై సూర్యాపేట పట్టణంలో నిరసన
ఫ 420 ఫీట్ల ఫ్లెక్సీతో వినూత్న
రీతిలో భారీ ర్యాలీ


