పట్టుదలతో శ్రమిస్తేనే లక్ష్య సాధన సులువు | - | Sakshi
Sakshi News home page

పట్టుదలతో శ్రమిస్తేనే లక్ష్య సాధన సులువు

Sep 3 2026 8:35 AM | Updated on Sep 3 2026 8:35 AM

సూర్యాపేటటౌన్‌ : విద్యార్థులు పట్టుదలతో శ్రమిస్తేనే లక్ష్య సాధన సులువని ఎస్పీ నరసింహ అన్నారు. పోలీస్‌ ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బాలెంల గ్రామ సమీపంలో ఉన్న సోషల్‌ వెల్ఫేర్‌ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో సామాజిక అంశాలు, సైబర్‌ జాగృక్త్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విజయానికి మధ్య మార్గాలు ఉండవని, నిరంతర కృషి, సాధన చేయాలన్నారు. ఉన్నత లక్ష్యాలతో యువత, విద్యార్థులు ముందుకు సాగుతూ జీవితంలో గొప్పస్థాయిలో స్థిరపడాలన్నారు. సమాజానికి సేవ చేసే వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. సైబర్‌ జాగృక్త్‌ కార్యక్రమం ద్వారా సైబర్‌ మోసాల పట్ల ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామని తెలిపారు. సాంకేతిక, ఇంటర్నెట్‌ వినియోగం వల్ల బ్యాంకింగ్‌ వివరాలు సెల్ఫోన్‌ ద్వారానే నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌, రూరల్‌ ఎస్సై అనిల్‌రెడ్డి, షీ టీమ్స్‌ ఎస్‌ఐ నీలిమ, పోలీస్‌ సిబ్బంది, కళాశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఫ ఎస్పీ నరసింహ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement