తిరుమలగిరి ( తుంగతుర్తి) : తిరుమలగిరి క్రాస్ రోడ్డు వద్ద తొర్రూర్–మోత్కూరు, సూర్యాపేటకు వెళ్లే జాతీయ రహదారుల్లో అంధకారం నెలకొంది. ఆ యా రోడ్లకు మధ్యలోగాని, ఇరువైపులా కాని వీధిలైట్లు ఏర్పాటు చేయలేదు. దీనికితోడు రోడ్లు గుంతలమయంగా ఉండడంతో రాత్రి వేళల్లో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు.అధికారులు స్పందించి వీధిలైట్లు వేయాల ని ప్రయాణికులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.
సూర్యాపేట వైపు వెళ్లే రహదారి ఇలా..
తొర్రూర్ రోడ్డులో కనిపించని లైట్లు


