సూర్యాపేట : బుల్లెట్ ట్రైన్ సాధనకు తమ వంతుగా పోరాడుతామని పీఓడబ్ల్యూ జిల్లా కమిటీ పేర్కొంది. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం 16వ రోజు దీక్షలో ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ జిల్లా కమిటీ ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. ఈ దీక్షలో ఆ సంఘం సభ్యులు కంచర్ల నర్సమ్మ, గుణగంటి నీలమ్మ, అలుగుబెల్లి వాణిశ్రీ,, సామ ఉపేంద్ర, వెంకటమ్మ,ఎల్లమ్మ, సుప్రియ, జయసుధ పాల్గొన్నారు. దీక్షకు మాజీ కౌన్సిలర్ ఆనంతుల మల్లేశ్వరి,బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ నాయకులు సంఘీభావం తెలిపారు. దీక్షకు సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బెలిదె శ్రీనివా సులు, నాయకులు కర్నాటి కిషన్, జిల్లా ఆర్యవైశ్య సంఘం కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్, పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ సలహాదారులు మిట్టపల్లి రమేష్, ఉపాధ్యక్షులు గుండా శ్రీధర్, సోమ వెంకటేశ్వర్లు, కోశాధికారి ఉప్పల శ్రవణ్ కుమార్, సోమ ప్రవీణ్, ప్రవీణ్, కలకోట లక్ష్మయ్య పాల్గొన్నారు.


