పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

Aug 19 2026 1:12 AM | Updated on Aug 19 2026 1:12 AM

సూర్యాపేట : పద్మశాలి సేవా సమాజ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారములు, నోట్‌ పుస్తకములు పంపిణీ చేయనున్నట్లు ట్రస్ట్‌ అధ్యక్షుడు పెండెం చంద్రశేఖర్‌, ప్రధాన కార్యదర్శి పెండెం వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు గానూ అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 2025–26 విద్యా సంవత్సరంలో 10 తరగతి, సీనియర్‌ ఇంటర్‌లో ఉత్తమ మార్కులు సాధించిన 20 మంది విద్యార్థులకు రూ.1500 చొప్పున నగదు బహుమతి అందిస్తామని పేర్కొన్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు అందించనున్నట్లు తెలిపారు. వీటిని ఈ నెల 23న ఆదివారం ఉదయం10 గంటలకు పద్మశాలి భవన్‌లో అందిస్తామని చెప్పారు. ఆసక్తిగల విద్యార్థులు తమ పేర్లను పద్మశాలి భవన్‌లో లేదా సెల్‌: 7893661102 నంబర్‌కు ఫోన్‌ చేసి నమోదు చేసుకోవాలని సూచించారు.

అభివృద్ధి పనులు

వేగవంతం చేయాలి

పెన్‌పహాడ్‌ : పామ్‌ పాండ్స్‌ పనులను వేగవంతం చేయాలని జడ్పీ సీఈఓ శిరీష ఆదేశించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయాన్ని సందర్శించారు. మండలంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో పామ్‌ పాండ్స్‌ల నిర్మాణంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇంటిగ్రేటెడ్‌ పామ్‌ పాండ్స్‌ ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని సూచించారు. వీటి ద్వారా వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, వ్యవసాయానికి నీటి లభ్యత వంటి ప్రయోజనాలు కలుగుతాయన్నారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో డీపీఓ యాదగిరి, ఎంపీడీఓ జానయ్య, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులు ఉన్నత

లక్ష్యాలను ఎంచుకోవాలి

సూర్యాపేటటౌన్‌ : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని, వాటి సాధనకు కష్టపడి చదవాలని ఎస్వీ ఇంజనీరింగ్‌ కళాశాల సెక్రటరీ వనం సత్యేందర్‌, ట్రెజర్‌ జయరాజ్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కళాశాలలో నూతన విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్‌ కార్యక్రమంలో వారు వాట్లాడారు. రెండు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఎస్వీ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోందన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల భవిష్యత్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఓడీలు సీహెచ్‌. సురేష్‌కుమార్‌, డి.నాగరాజు, జి.వెంకటేష్‌, ఆర్‌.శివశంకర్‌, బి.గాంధీ, పి.వెంకటేష్‌, సూపరింటెండెంట్లు కె. జానకిరాములు, బి.శ్రీనివాస్‌, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement