శివారు ప్రాంతాల్లో అధ్వానం
తిరుమలగిరి( తుంగతుర్తి) : తిరుమలగిరి నుంచి నందపురం, నందపురం నుంచి అనంతారం వెళ్లే రోడ్డు మున్సిపాలిటీ పరిధిలో అధ్వానంగా మారింది. రోడ్డుపై కంకర తేలడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు కోటి లింగాల కాలనీ, బీసీ కాలనీ, సుందరయ్య నగర్‌లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా నెలకొంది. సీసీ రోడ్లు లేకపోవడంతో వానాకాలం బరదగా మారి రాకపోకలు సాగించలేని పరిస్థితి ఉంటుంది. ఇక శివారు ప్రాంతాల్లో రోడ్లపై ప్రయాణం చేయాలంటేను చుక్కలు కనిపిస్తున్నాయి. సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని అధికారులు చెబుతున్నారే తప్ప.. పనులు మాత్రం ప్రారంభించడం లేదని స్థానికులు వాపోతున్నారు.


