కోదాడను అగ్రగామిగా నిలుపుతా
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కోదాడ: అభివృద్ధిలో కోదాడ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది, రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతానని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కోదాడలో నిర్మాణంలో ఉన్న ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్, కోర్టుల సముదాయం, నీటిపారుదలశాఖ కార్యాలయ భవనాలను శుక్రవారం ఎమ్మెల్యే పద్మావతితో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కోదాడ నియోజకవర్గంలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ఇప్పటికే కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. శాంతినగర్, రెడ్లకుంట ఎత్తిపోతల పథకాలు పూర్తయితే నియోజకవర్గంలో కాల్వ చివరి భూములు వేలాది ఎకరాలకు నీరు అందుతుందన్నారు. వంద పడకల వైద్యశాల భవనం పనులు కూడా త్వరలోనే పూర్తి అవుతాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి 100 శాతం ఫలితాలు సాధించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు వేనేపల్లి చందర్‌రావు, చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, వంగవేటి రామారావు, గాలి శ్రీనివాస్, చింతలపాటి శ్రీనివాస్, ఈదుల కృష్ణయ్య, ఉయ్యాల నర్సయ్య, మేకల వెంకట్రావ్, కేఎల్‌ఎన్ ప్రసాద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


