నూరుశాతం ఫలితాలు సాధించాలి
భానుపురి (సూర్యాపేట) : పదో తరగతి వార్షిక పరీక్షల్లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించేందుకు ప్రతి ఎంఈఓ కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంఈఓలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రమం తప్పకుండా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, అభ్యాసనన పుస్తకాలు అందించాలని, 2 ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రతి విద్యార్థికి పరీక్షప్యాడ్, పెన్, పెన్సిల్, స్కేలు ఇవ్వాలని ఎంఈఓలకు స్పష్టం చేశారు. సమావేశంలో డీఈఓ ఆశోక్, ఎస్సీ కార్పొరేషన్ సంక్షేమ అధికారి దయానంద రాణి, కోఆర్డినేటర్లు రాంబాబు, జనార్దన్ పాల్గొన్నారు.
లైసెన్స్ తప్పనిసరి
చివ్వెంల(సూర్యాపేట) : లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని సూర్యాపేట జిలా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు. రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆటో డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. రాంగ్ రూట్‌లో వెళ్లరాదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, దీనివల్ల తల్లిదండ్రులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత నియమాల పోస్టర్‌ను ఆటోపై స్వయంగా అతికించారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి నాగూరి అపూర్వ రవళీ, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ జయ ప్రకాశ్‌రెడ్డి, టౌన్ సీఐ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం పాల్గొన్నారు.
జాతీయ సైన్స్ ప్రదర్శనకు ఎంపిక
చివ్వెంల(సూర్యాపేట) : కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర సైన్స్ ఫెస్ట్–2025లో చివ్వెంల మండల పరిధిలోని ఎంఎస్‌ఆర్ సెంట్రల్ స్కూల్ విద్యార్థి మెరిశాడు. విద్యార్థి కొల్లు మహిదర్ రూపొందించిన ‘స్మార్ట్ స్టీరింగ్ విత్ హెల్త్ అలర్ట్స్ టు రెడ్యూస్ ది అక్సిడెంట్’ ఉత్తమ ఎగ్జిబిట్‌గా నిలిచి జాతీయస్థాయి ప్రదర్శనకు ఎంపికై నట్లు డీఈఓ అశోక్ తెలిపారు. విద్యార్థిని డీఈఓ, ఉపాధ్యాయులు అభినందించారు.
బాల్య వివాహాలు చేయడం నేరం
చివ్వెంల(సూర్యాపేట) : బాల్య వివాహలు చేయడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని సూర్యాపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత అన్నారు. బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. బాల్య వివాహాల వల్ల తలెత్తే అనర్థాలపై వారికి అవగాహన కల్పించారు. చిన్న వయస్సులో పెళ్లి చేసుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. బాలికల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థి దశనుంచే లక్ష్యాన్ని ఎంచుకొని, సాధించేందుకు కృషి చేయాలన్నారు. బాల్య వివాహాల విషయంలో సంబంధిత శాఖల అధి కారులు కఠినంగా వ్యవహరించాలని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో నామినేటెడ్ సభ్యుడు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్‌కుమార్, కె.ప్రియదర్శిని, ఎస్‌ఐ ఐలయ్య, హెచ్‌ఎం నాగరాణి తదితరులు పాల్గొన్నారు.
నూరుశాతం ఫలితాలు సాధించాలి
నూరుశాతం ఫలితాలు సాధించాలి


