పరిశ్రమల నిర్వాహకులు సహకరించాలి : కలెక్టర్
భానుపురి (సూర్యాపేట) : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులు క్షేమంగా రాకపోకలు సాగించేందుకు పరిశ్రమల నిర్వాహకులు సహకరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల అధికారి సీతారాంనాయక్‌తో కలిసి సిమెంట్ కంపెనీలు, రైస్ మిల్లర్స్, లారీ ఓనర్స్ ప్రతినిధులతో వెబ్‌ఎక్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పైనుంచి ఆంధ్ర ప్రాంతానికి ప్రజలు పెద్దసంఖ్యలో వెళ్తారని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వాహనాలు సాఫీగా వెళ్లేలా హైవేపై భారీ లోడ్ వాహనాల రాకపోకలను తగ్గించాల్సిందిగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆయా కంపెనీల ప్రతినిధులు నేటినుంచి ఈనెల 18వ తేదీ వరకు లారీలు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రమాదాలకు ఆస్కారం ఉండొద్దు : ఎస్పీ
కోదాడ రూరల్ : సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రజానీకం సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా జాతీయ రహదారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ నరసింహ పోలీసు అధికారులను ఆదేశించారు. కోదాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై కొమరబండ వైజంక్షన్ వద్ద జరుగుతున్న పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా సర్వీస్ రోడ్లు, క్రాసింగ్‌ల వద్ద సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐలు శివశంకర్, రామారావు, ఎస్‌ఐలు సుఽధీర్, గోపాల్‌రెడ్డి, అంజిరెడ్డి ఉన్నారు.
పరిశ్రమల నిర్వాహకులు సహకరించాలి : కలెక్టర్


