3 సెంటర్లు.. 2,565 మంది అభ్యర్థులు
సూర్యాపేట టౌన్ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టీజీ టెట్) శనివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు మొత్తం తొమ్మిది రోజుల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. కాగా ఉదయం, మధ్యాహ్నం రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే డిసెంబర్ 27 నుంచి హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో విడుదల చేసిన నేపథ్యంలో అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేయనున్న నేపథ్యంలో అభ్యర్థులు పావుగంట ముందస్తుగా సెంటర్లలోకి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో కేటాయించిన మూడు కేంద్రాల్లో సీబీటీ (కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్) విధానంలో నిర్వహించనున్న ఈ పరీక్షలకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
జిల్లాలో 2,565 మంది అభ్యర్థులు
వివిధ జిల్లాలకు చెందిన 2,565 మంది అభ్యర్థులు సూర్యాపేట జిల్లాలో టెట్ రాయనున్నారు. జిల్లాకు చెందిన అభ్యర్థులు ఇతర జిల్లాల్లో పరీక్ష రాయనున్నారు. రోజుకు రెండు సెషన్లలో జరగనుండగా మొదటి సెషన్ పరీక్ష ఉదయం 9గంటల నుంచి ఉదయం 11.30గంటల వరకు, రెండవ సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు జరగనుంది.
మూడు సెంటర్లలో పరీక్షలు
టెట్ నిర్వహణకు జిల్లాలో మూడు ఇంజనీరింగ్ కళాశాలల్లో సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో కోదాడలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాల, కిట్స్, సన ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. అనురాగ్‌లో 340 మంది అభ్యర్థులు, కిట్స్ కళాశాలలో 90 మంది, సన కళాశాలలో 50 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఒక్కో సెషన్‌కు మొత్తం 340 మంది చొప్పున అభ్యర్థులు హాజరుకానున్నారు.
ప్రభుత్వ టీచర్లకు ఇక్కట్లే..
బీఈడీ, టీటీసీ అభ్యర్థులతోపాటు ప్రభుత్వ టీచర్లకు కూడా టెట్ అర్హత తప్పనిసరి చేశారు. దీంతో జిల్లాలో 1,500 మంది వరకు టీచర్లు టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇతర జిల్లాల్లో సెంటర్లు పడిన మన జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పడం లేదు.
నేటి నుంచి టెట్
ఫ కోదాడలోని మూడు ఇంజనీరింగ్ కళాశాలల్లో సెంటర్లు
ఫ ఉదయం, మధ్యాహ్నం రెండు
సెషన్లలో పరీక్షలు
ఫ ప్రభుత్వ ఉపాధ్యాయులకు
తప్పని పరీక్ష తిప్పలు


