ఎస్సారెస్పీ కాల్వలను ఆధునీకరించాలి
తుంగతుర్తి, అర్వపల్లి, నూతనకల్, ఆత్మకూర్(ఎస్) : ఎస్సారెస్పీ 2 దశ కాల్వలను ఆధునీకరించాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం జాగృతి జనం బాటలో భాగంగా ఆమె తుంగతుర్తి, అర్వపల్లి, నూతనకల్, ఆత్మకూర్(ఎస్) మండలాల్లో పర్యటించారు. తుంగతుర్తి మండలం వెలుగుపల్లి రుద్రమ్మ చెరువును, తుంగతుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగుల బాగోగులు తెలుసుకున్నారు. కర్విరాల కొత్తగూడెంలో మారోజు వీరన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అర్వపల్లిలో కేజీబీవీకి వెళ్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఎస్‌ఓ నాగరాణితోపాటు టీచర్లను సన్మానించారు. శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి దేవాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం అర్వపల్లి శివారులో ఎస్సారెస్పీ 71డీబీఎం కాల్వను పరిశీలించారు. అనంతరం ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్లు దండు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టిన సామాజిక జేఏసీ కమిటీ అధ్యక్షుడు భూపతి రాములు, కర్ణాకర్, జలగం మల్లేశ్, జంగా జానయ్య, మేడి కృష్ణ, గంపల కృపాకర్, నాగరాజు, సుందర్, సైదులు, జల్ల రాములును శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో కవిత మాట్లాడుతూ రుద్రమ్మ చెరువును రిజర్వాయర్‌గా చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరిగిన తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆస్పత్రిగా మార్చాలన్నారు. మారోజు వీరన్న ఆశయాల సాధనకు జాగృతి కృషిచేస్తుందన్నారు. నూతనకల్‌లో మహిళలకు బాత్‌రూమ్‌లు, అలాగే బస్ షెల్టర్ నిర్మించాలన్నారు. ప్రజా సమస్యలతు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేసేందుకు జనంబాటచేపట్టామన్నారు. సాయుధ పోరాటానికి పెట్టింది పేరు సూర్యాపేట జిల్లా అని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు ఇస్మాయిల్, జిల్లా అధ్యక్షురాలు సూరారపు కృష్ణవేణి, నాయకులు డాక్టర్ నిర్మల్ కుమార్, భిక్షం, లింగయ్య, లింగంపల్లి రమణ, పంది యాదగిరి, దుగ్యాల రవీందర్‌రావు, నకిరేకంటి చిరంజీవి, మహేష్ పాల్గొన్నారు.
ఫ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఫ తుంగతుర్తి, సూర్యాపేట
నియోజకవర్గాల్లో ‘జాగృతి జనం బాట’
ఎస్సారెస్పీ కాల్వలను ఆధునీకరించాలి


