వార్డుల కూర్పుపై అసంతృప్తి
ఓట్ల తేడా వందల్లో..
కోదాడ : కోదాడ మున్సిపల్ అధికారులు తయారు చేసిన ముసాయిదా ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల నాయకులతో పాటు వార్డుల ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పట్టణానికి ఒక చివరన ఉన్న ఓటరు పేరు మరో చివర ఉన్న వార్డులో చేర్చారని, కొన్ని వార్డులను కలకూరగంపగా మార్చారని, ఆయా ఓటర్లు పట్టణంలో ఏ ప్రదేశంలో ఉన్నారో తెలుసుకోవడం కూడ కష్టంగా ఉందని పలువురు నాయకులు అంటున్నారు. దీంతోపాటు వార్డుల్లో ఓటర్ల సంఖ్యలో చాలా తేడాలున్నాయని ఒక్కో వార్డులో మూడు, నాలుగు వందల మంది తేడా ఉండడం వల్ల తీవ్ర ఇబ్బంది అవుతుందని పలువురు ఫిర్యాదు చేశారు. ఒక వార్డులో 2,300 మంది ఓటర్లు ఉంటే మరో వార్డులో కేవలం 1,300 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారని దీన్ని బట్టే మున్సిపల్ అధికారులు పట్టణంలోఇ అన్ని వార్డుల విభజన ఎంత అశాసీ్త్రయంగా చేశారో అర్థం అవుతుందని వారు ఆరోపిస్తున్నారు.
వార్డుల పరిధి ఇలా చేశారు..
కోదాడ మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డులున్నాయి. వీటిలో 1, 2 వార్డులు లక్ష్మీపురం, ఇందిరమ్మ కాలనీకి, 3, 4 వార్డులు తమ్మర గ్రామానికి చెందినవి కాగా.. 5, 6 వార్డులు శ్రీరంగాపురానికి చెందినవి. 7, 8 వార్డులు బాలాజీనగర్‌కు, 9వ వార్డు సాలార్‌జంగ్‌పేట, 10, 11 కొమరబండకు, 12వ వార్డు రామిరెడ్డిపాలెం, 13 నుంచి 17 వార్డుల వరకు నయానగర్, 18వ వార్డు ఖమ్మం క్రాస్‌రోడ్డు, 19 భవానినగర్, 20 బంజర కాలనీ, 21 శ్రీమన్నారాయణ కాలనీ, 22 పెరిక హాస్టల్ నుంచి రెడ్‌చిల్లి వరకు, 23 లాల్‌బంగ్లా నుంచి వర్తక సంఘం వరకు, 24 మున్సిపాలిటీ నుంచి సాయికృష్ణ థియేటర్ వరకు, 25 చెరువుకట్ట బజార్‌కు, 26వ వార్డు సుధాబ్యాంక్ నుంచి బస్టాండ్ వరకు, 27వ వార్డు ఎంఎస్ కాలనీ, మాతానగర్, 28 రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఏర్నేనిబాబు ఇంటి వరకు, 29 సంత ఎదురు బజార్ నుంచి పారా సీతయ్య ఇంటి వరకు, 30 వెంకటేశ్వర థియేటర్ వెనుక బజార్, 31 శ్రీనివాసనగర్, 32 బాలికల పాఠశాల నుంచి గొల్లబజార్ వరకు, 33 బొడ్రాయి బజార్, 34, 35వ వార్డుల్లో గాంధీనగర్, ఎస్సీ కాలనీ, మాలపల్లి ఉన్నాయి.
ఫ వార్డుల విభజన శాసీ్త్రయంగా
జరగలేదంటున్న ప్రజలు
ఫ గందరగోళంగా కోదాడ మున్సిపల్ ఓటరు ముసాయిదా జాబితా
ఫ వార్డుల్లో ఓటర్ల సంఖ్య మధ్య భారీ
వ్యత్యాసముందని ఫిర్యాదులు
ఫ స్పల్ప మార్పులే చేశామంటున్న మున్సిపల్ అధికారులు
పట్టణంలో ఉన్న 35 వార్డుల్లో 2 వేలకుపైగా ఓటర్లు ఉన్న వార్డులు 3 ఉండగా, 1,500 నుంచి 2వేల ఓటర్లు ఉన్న వార్డులు 25 ఉన్నాయి. 1,500 కన్నా తక్కువ ఓట్లు ఉన్న వార్డులు 7 ఉన్నాయి. నయానగర్‌లో ఉన్న 16వ వార్డులో అతి తక్కువగా 1,298 మంది ఓటర్లు, దీని పక్కనే ఉన్న 17వ వార్డులో 1,440 మంది ఓటర్లు ఉన్నారు. కానీ వీటి పక్కనే ఉన్న 18వ వార్డులో మాత్రం 2,378 మంది ఓటర్లను ఉంచారు. కలిసి ఉన్న ఈ మూడు వార్డుల ఓటర్లను సమానంగా విభజించే వీలున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోకుండా తమ ఇష్టం వచ్చినట్లు చేశారని పలువురు అంటున్నారు. ఇక పట్టణానికి చెందిన ఓ నాయకుడు మున్సిపాలిటీలో చక్రం తిప్పుతున్న కాంట్రాక్టర్ సాయంతో తన సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లను ఈ వార్డులో వేయించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కొందరు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు మాత్రం ముసాయిదా జాబితాపై ఫిర్యాదులుంటే తమ కు చెప్పవచ్చని వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని చెబుతున్నారు.


