‘కోఆప్షన్’పై ఆశలు
ఒక్కో పంచాయతీలో
ముగ్గురు చొప్పున
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు ఇటీవలే కొలువుదీరాయి. నూతన సర్పంచ్‌లు పాలనపై దృష్టి పెట్టగా.. ఇప్పుడు అందరిచూపు కోఆప్షన్ పదవులపై పడింది. అయితే కోఆప్షన్ సభ్యులకు వార్డు సభ్యులతో సమాన హోదా ఉండడంతో అన్ని గ్రామాల్లో రాజకీయ పార్టీలు, సర్పంచ్‌ల మద్దతుదారులు, ఓడిపోయిన అభ్యర్థులు కోఆప్షన్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా కోఆప్షన్ సభ్యుల ఎంపికలో ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లే కీలకం కావడంతో వారి మద్దతుదారులు ఆ పదవులు దక్కించుకునేందుకు పైరవీలకు తెరలేపారు. రాజకీయ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఈ కోఆప్షన్ పదవి కీలకం కానుంది.
2018 పంచాయతీ చట్టం మేరకు..
2018 ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రస్తుత పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులతోపాటు ముగ్గురు కోఆప్షన్ సభ్యులను నియమించవచ్చు. చట్టం ప్రకారం కోఆప్షన్ సభ్యులుగా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, గ్రామ సమాఖ్య అధ్యక్షురాలిని తప్పక చేర్చాలి. మరో కోఆప్షన్ కోసం పంచాయతీ భవన నిర్మాణానికి భూమి దానం చేసిన వ్యక్తికి కూడా ఇవ్వవచ్చు. గ్రామ సంక్షేమానికి కృషిచేసిన ఎవరినైనా ఎంచుకోవచ్చు. ప్రధానంగా వీరి నియామకంలో సర్పంచ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓటుహక్కు లేకపోయినా, వార్డు సభ్యుల స్థాయి అధికారాలు వీరికి లభిస్తాయి. పంచాయతీ సమావేశాలకు ఆహ్వానం ఉంటుంది.
ఫ ప్రతీ పంచాయతీలో ముగ్గురికి చాన్స్
ఫ వార్డు మెంబర్లతో సమాన హోదా
ఫ ఎలాగైనా దక్కించుకోవాలని
ఆశావహుల పైరవీలు
ఫ ఎంపికలో ఎమ్మెల్యేలు,
సర్పంచ్‌లే కీలకం
ఫ జిల్లాలో 1,458 కోఆప్షన్ స్థానాలు
జిల్లా వ్యాప్తంగా 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటన్నింటికీ మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఒక్కో పంచాయతీలో ముగ్గురు చొప్పున 1,458 మంది కోఆప్షన్ సభ్యులు నియమితులు కానున్నారు. జిల్లాలో అధిక స్థానాలను కై వసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీనే ఈ పదవులను దక్కించుకోవాలని చూస్తోంది. అలాగే ఎమ్మెల్యేల మద్దతుతో ఇతర పార్టీల మద్దతుదారులు సర్పంచ్‌లు ఉన్నచోట తమ మద్దతుదారులకే కోఆప్షన్ల పదవులు కట్టబెట్టాలన్న ఆలోచనలో అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.


