మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తాచాటాలి | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తాచాటాలి

Jan 4 2026 6:54 AM | Updated on Jan 4 2026 6:54 AM

మున్స

మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తాచాటాలి

నేరేడుచర్ల : మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలిచేలా సత్తాచాటాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం నేరేడుచర్ల పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొణతం నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కోశాధికారి తాళ్ల నరేందర్‌రెడ్డి, జిల్లా ఐటీ సెల్‌ కన్వీనర్‌ చిలకరాజు కరుణాకర్‌, నాయకులు సంకలమద్ది, సత్యనారా యణరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఏమిరెడ్డి శంకర్‌రెడ్డి, కా లం నాగయ్య, ఉపాధ్యక్షులు జూలూరు అశోక్‌, సినియర్‌ నాయకులు మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, రామ్మూర్తి, బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, చెరుకు రాము, మలిగిరెడ్డి రఘునాధరెడ్డి, దేవిరెడ్డి, నాగిరెడ్డి, సైదులు, చంద్రయ్య, విమల, కృష్ణవేణి, నాగమణి పాల్గొన్నారు.

వైభవంగా గరుడ

వాహన సేవ

మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శనివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపి నిత్యకల్యాణం నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో వైభవంగా ఊరేగించారు. నీరాజన మంత్ర పుష్ఫాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. అలాగే ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో గోదాదేవి అమ్మవారికి తిరుప్పావై సేవాకాలం ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్‌, ఈఓ నవీన్‌కుమార్‌, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీనారాయణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

కూలీల పొట్టగొట్టేందుకు కొత్త బిల్లు

సూర్యాపేట అర్బన్‌ : ఉపాధి హామీ కూలీల పొట్టగొట్టేందుకే వికసిత భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అవిజిక మిషన్‌ (గ్రామీణ) బిల్లు 2025ను కేంద్రం తీసుకొచ్చిందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య ఆరోపించారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని ఎంవీఎన్‌ భవన్‌లో జరిగిన ఆ సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, జిల్లా ఆఫీస్‌ బేరర్స్‌ పులుసు సత్యం, సోమపంగు జానయ్య, పోసనబోయిన హుస్సేన్‌, జంపాల స్వరాజ్యం, గుంజ వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు రామకృష్ణారెడ్డి, అంజపల్లి లక్ష్మయ్య, ఉయ్యాల పారిజాత పాల్గొన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తాచాటాలి1
1/2

మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తాచాటాలి

మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తాచాటాలి2
2/2

మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తాచాటాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement