17 మందికి ‘కుష్టు’ లక్షణాలు
సూర్యాపేట టౌన్ : జాతీయ కుష్టువ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే ద్వారా 1,042 మందిని అనుమానితులుగా గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించగా 17 మందికి కుష్టు లక్షణాలు ఉన్నట్టు తేల్చామని డీఎంహెచ్‌ఓ డాక్టర్ పెండెం వెంకటరమణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాధి నిర్థారణ చేసిన వారికి బహుళ ఔషధ చికిత్స ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఎవరికైనా శరీరంపై ఎలాంటి మచ్చలు ఉన్నా వైద్య సిబ్బందిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు.
‘చలో అసెంబ్లీ’కి తరలిరావాలి
కోదాడ రూరల్ : రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెన్‌ఫిట్స్ కోసం ఈ నెల 5న నిర్వహించ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని 2024 రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు పోనుగోటి కోటయ్య, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు కోరారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవన్‌లో నిర్వహించిన రిటైర్డ్ ఉద్యోగుల సమావేశంలో వారు మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెన్‌ఫిట్స్ అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమావేశంలో ఆ సంఘం డివిజన్ అధ్యక్షుడు బాలేమియా, అమృతారెడ్డి, జగన్, వరప్రసాద్, భ్రమరాంభ, పుల్లయ్య, లక్ష్మి, నర్సయ్య, కోటయ్య, లక్ష్మీనర్సయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి చట్టం రద్దు
ప్రజా వ్యతిరేక చర్య
మునగాల : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి జీరాంజీ పేరుతో నూతన చట్టం తీసుకురావాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రజా వ్యతిరేక చర్య అని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. ప్రధాని మోదీ నిర్ణయాన్ని నిరసిస్తూ శుక్రవారం మునగాల మండల కేంద్రంలోని గణపవరం క్రాస్ రోడ్డులో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి మాట్లాడారు. అనంతరం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంలగాణలోని ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ విధానం ద్వారా పదవులు భర్తీచేయడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆ పార్టీ నాయకులు ములకపల్లి రాములు, బచ్చలకూరి స్వరాజ్యం, షేక్ సైదా, బుర్రి శ్రీరాములు, చందా చంద్రయ్య, వీరబోయిన వెంకన్న, అనంతు గుర్వయ్య, తుమ్మ సతీష్, సోంపంగు నర్సయ్య, మొగిలిచెర్ల సీతారాములు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మామిడి గోపయ్య, సోంపంగు జానయ్య, బట్టు నాగయ్య, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
30న ఎన్జీ కాలేజీలో
గాంధీ విగ్రహాల ప్రదర్శన
రామగిరి (నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కాలేజీ మైదానంలో ఈ నెల 30న గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాల ప్రదర్శన నిర్వహించనున్నట్లు చీఫ్ అడ్వైజర్ ఎంవీ.గోనారెడ్డి తెలిపారు. శుక్రవారం నల్లగొండలో నిర్వహించిన సమావేశంలో కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో యానాల ప్రభాకర్‌రెడ్డి, నీరుడు దయాకర్‌రెడ్డి, కె.కరుణాకర్‌రెడ్డి, పాముల అశోక్, గిరిబాబు పాల్గొన్నారు.
17 మందికి ‘కుష్టు’ లక్షణాలు


