అర్వపల్లి దర్గా ఉర్సుకు వేళాయే..
అర్వపల్లి: మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన అర్వపల్లి శివారులో ఉన్న హజ్రత్ ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గా ఉర్సు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇదే రోజు రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి గంధం ఊరేగింపు ఉంటుంది. రాత్రి ఖవ్వాలీ కార్యక్రమం నిర్వహిస్తారు. శనివారం దీపారాధనతో ఉత్సవాలు ముగుస్తాయి. రెండు రోజుల పాటు నిర్వహించే ఉర్సుకు సంబంధించి దర్గాను విద్యుత్ లైట్లతో ముస్తాబుచేశారు. అలాగే దర్గాకు వచ్చే రోడ్డును తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. దర్గా పరిసరాలను శుభ్రం చేయించారు. నిరంతరం విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించారు. దర్గా రోడ్డు వెంట, పరిసరాల్లో లైట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు వక్ఫ్‌బోర్డు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే.మహమూద్, ముజావర్ సయ్యద్ అలీ తెలిపారు. కాగా ఉర్సు సందర్భంగా వివిధ రకాల దుకాణాలు వెలిశాయి.
ఫ నేడు గంధం ఊరేగింపుతో శ్రీకారం
ఫ రెండు రోజుల పాటు ఉత్సవాలు
ఫ విద్యుత్‌దీపాలతో దర్గా ముస్తాబు
ఫ భారీగా తరలిరానున్న భక్తులు


