ఫ్యామిలీ కోర్టు మంజూరు చేయాలని వినతి
చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేటకు ఫ్యామిలీ కోర్టును మంజూరు చేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, పోర్ట్ పోలియో జడ్జి జస్టిస్ మాధవి దేవి, జస్టిస్ కునూరు లక్ష్మణ్ గౌడ్, జస్టిస్ పంచాక్షరిచ, జస్టిస్ సుద్దాల చలపతిరావు లను బార్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈమేరకు సూర్యాపేట బార్‌అసోసియేషన్ సభ్యులు గురువారం హైదరాబాద్‌లో వారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందజేశారు. సూర్యాపేటకు ఎస్సీ, ఎస్టీ కోర్టు, వినియోగదారులు కోర్టు లను కూడా మంజూరు చేయాలని విన్నవించారు. దీనికి జడ్జిలు స్పందించి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, న్యాయవాదులు జే.శశిధర్, మోదుగు వెంకట్ రెడ్డి, బాణాల విజయ్ కుమార్, కాకి రాంరెడ్డి, దావుల వీర ప్రసాద్, అనంతుల సందీప్ కుమార్, మంచినీళ్ల లక్ష్మణ్, కట్ట సుధాకర్, కాసం సరిత పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ సూచించారు. ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా గురువారం సూర్యాపేట మండల కాసరబాద గ్రామ శివారులోని అపూర్వ బధిరుల పాఠశాలను ఆమె సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆహారం, ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని హెచ్‌ఎం మదనా చారిని ఆదేశించారు. పిల్లల హక్కుల పరిరక్షణకు డీఎల్‌ఎస్‌ఏ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
సహకార రంగంలో అపార అవకాశాలు
నల్లగొండ టూటౌన్ : సహకార రంగంలో యువతకు అపార అవకాశాలు లభిస్తున్నాయని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటీవ్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.గణేశన్ అన్నారు. గురువారం ఎంజీ యూలో విద్యార్థులకు సహకార రంగంలో అవకాశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో యూసీసీబీఎం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీదేవి, ప్రొఫెసర్ ఆకుల రవి, ప్రొఫెసర్ అంజిరెడ్డి, డాక్టర్ లక్ష్మీప్రభ, డాక్టర్ హరీష్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న జిల్లా న్యాయసేవాధికార
సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్


