
నీట మునిగిన పంట పొలాలు
మునగాల: రెండు మూడు రోజుల పాటు కురిసిన కురుస్తున్న వర్షాలకు లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. మునగాల, చిలుకూరు, నడిగూడెం, మండలాల్లో పంటపొలాలు నీటమునిగాయి. చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. మునగాల మండలంలోని మొద్దులచెరువు, కలకోవ ఊరచెరువు, రేపాల, నర్సింహులగూడెం, ముకుందాపురం తిప్పాయికుంట, ఆకుపాముల నాగులకుంట చెరువులు గరువారం నుంచి తిరిగి అలుగుపోస్తున్నాయి. మునగాల మండల వ్యాప్తంగా ఉన్న 34చెరువులు మరో రెండు రోజులు ఇదే విధంగా వర్షం కురిస్తే అలుగులు పోసే అవకాశాలు కన్పిస్తున్నాయని ఇరిగేషన్ ఏఈఈలు శ్రీనివాస్, వినయ్ తెలిపారు.
ప్రవహిస్తున్న వాగులు
చిలుకూరు: చిలుకూరు మండల పరిధిలోని చిలుకూరు, బేతవోలు, నారాయణపురం, చెన్నారిగూడెం , చిలుకూరు చెరువులు అలుగుపోస్తున్నాయి. వాగులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చిలుకూరు మండల వ్యాప్తంగా చెరువులు, వాగుల కింద దాదాపు 350 ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగినట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. వరి పొలాల్లో గండ్లు పడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఫ రెండు రోజుల పాటు ఎడతెరిపి
లేకుండా కురిసిన వర్షం
ఫ లోతట్టు ప్రాంతాలు జలమయం
ఫ అలుగుపోస్తున్న చెరువులు, కుంటలు