
హామీలు అమలు చేసేలా ఒత్తిడి తేవాలి
భానుపురి (సూర్యాపేట) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఆగస్టు 30 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఒత్తిడి తేవాలని ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డిని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగ సంతోష్ రెడ్డి కోరారు. గురువారం సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగదీష్‌రెడ్డిని తెలంగాణ యువజన సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌ను త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు భాషా పొంగు సునీల్ జిల్లా అధ్యక్షులు విప్లవ కుమార్, ధరావత్ శివ, చేరుకు నగేష్, తుమ్మల క్రాంతి కుమార్, బంటు సందీప్, శివ, నవీన్ పాల్గొన్నారు.