
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
మోతె: మోతె మండల కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకుల నుంచి 1.200 కేజీ గంజాయిని మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండల కేంద్రానికి చెందిన యువకుడు, తన స్నేహితులతో కలిసి భద్రాచలం, ఒరిస్సా ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి మోతె మండలానికి తీసుకొస్తుండగా.. ముందస్తు సమాచారం మేరకు ఎస్‌ఐ అజయ్‌కుమార్ తన సిబ్బందితో కలిసి మండల కేంద్రంలోని రత్నాలకుంట ఇద్దరిని పట్టుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పట్టుబడిన నిందితుల నుంచి 1.200 కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.