పవిత్ర మేడమ్‌ స్ఫూర్తితో.. | - | Sakshi
Sakshi News home page

పవిత్ర మేడమ్‌ స్ఫూర్తితో..

Aug 27 2025 8:12 AM | Updated on Aug 27 2025 8:12 AM

పవిత్

పవిత్ర మేడమ్‌ స్ఫూర్తితో..

బోధన తీరుతో స్ఫూర్తి పొందా..

సూర్యాపేటలోని ఎంఎస్‌ఆర్‌ బీఈడీ కళాశాలలో చదువుతున్నప్పుడు పవిత్ర మేడమ్‌ ప్రైవేట్‌ లెక్చరర్‌గా మాకు పాఠాలు బోధించేది. ఆమె బోధనా తీరు, ప్రేరణతో జీవితంలో ఉన్నతస్థాయికి చేరాలనే లక్ష్యంతో కష్టపడి చదివి ఉద్యోగం టీచర్‌ ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం చండూరు మండలం దానుపాముల జెడ్పీహెచ్‌ఎస్‌లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను.

– రాసమళ్ల సికిందర్‌, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, దానుపాముల, చండూరు

పెన్‌పహాడ్‌: పెన్‌పహాడ్‌ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మారం పవిత్ర జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డుకు ఎంపికయ్యారు. మారం పవిత్ర స్ఫూర్తితో ఆమె చదువు చెప్పిన ఎంతో మంది విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఆమె కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా.. తమలోని భయాలను తొలగించించేందుకు కృషిచేసేదని, చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు వారిలోని ఇతర ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేదని విద్యార్థులు చెబుతున్నారు.

స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యా..

నేను గరిడేపల్లి మండలం గడ్డిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో 10వ తరగతి చదువుతున్నాను. పవిత్ర టీచర్‌ ఇచ్చిన శిక్షణతోనే నేషనల్‌ మీన్స్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యాను. ప్రస్తుతం ప్రతి సంవత్సరం అకౌంట్‌లో రూ.12వేలు జమవుతున్నాయి. విద్యాభ్యాసం కోసం స్కాలర్‌షిప్‌ ఎంతగానో దోహదపడుతుంది.

– ఎ. వైష్ణవి, 10వ తరగతి, గడ్డిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌

టీచర్లు, లెక్చరర్లుగా పలువురి ఎంపిక

జిల్లా స్థాయి సైన్స్‌ ఫెయిర్‌లలో పాల్గొని సత్తాచాటుతున్న విద్యార్థులు

సంతోషంగా ఉంది

ఆంధ్ర, తెలంగాణ అగస్త్య జిజ్ఞాస పోటీల్లో మొదటి బహుమతి రావడం సంతోషంగా ఉంది. ఈ అవార్డుతో పాటు రూ.1500 ప్రైజ్‌మనీ పొందాను. జీవశాస్త్ర టీచర్‌ పవిత్ర మేడమ్‌ నన్ను ఎంతగానో ప్రోత్సహించింది.

– ఎం. మేఘన 10వ తరగతి,

పెన్‌పహాడ్‌ జెడ్పీహెచ్‌ఎస్‌

ప్రాక్టికల్‌ విధానంలో బోధన చూసి..

మద్దిరాల మండలం గోరంట్ల జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉన్నప్పుడు పవిత్ర టీచర్‌ ప్రాక్టికల్‌ విధానంలో సైన్స్‌ బోధించడం చూసి.. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఇస్రోలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కులీ కుతుబ్‌షా పాలిటెక్నిక్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. విద్యార్థులతో ఎలా ఉండాలనే విషయాన్ని పవిత్ర టీచర్‌ నుంచే నేర్చుకున్నాను.

– ప్రవీణ్‌కుమార్‌, పాలిటెక్నికల్‌ లెక్చరర్‌

జిల్లాస్థాయిలో గుర్తింపు లభించింది

పవిత్ర గైడెన్స్‌లో జిల్లాస్థాయి సైన్స్‌ ఫెయిర్‌లో వీడర్‌ అండ్‌ సీడర్‌ ప్రాజెక్టు ప్రదర్శించడంతో జిల్లా స్థాయిలో గుర్తింపు వచ్చింది. జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది.

– బి. శ్రీశాంత్‌, 10వ తరగతి,

పెన్‌పహాడ్‌ జెడ్పీహెచ్‌ఎస్‌

జిల్లా సైన్స్‌ ఫెయిర్‌లో అవార్డు దక్కింది

నేను తయారు చేసిన క్రాప్‌ ప్రొటెక్టర్‌ ఆఫ్‌ ఆన్‌సీజనల్‌ రెయిన్స్‌ ప్రాజెక్టుకు జిల్లా సైన్స్‌ఫెయిర్‌లో అవార్డు దక్కడం ఆనందంగా ఉంది.

– శ్వేత 10వ తరగతి, పెన్‌పహాడ్‌ జెడ్పీహెచ్‌ఎస్‌

పవిత్ర మేడమ్‌ స్ఫూర్తితో..1
1/7

పవిత్ర మేడమ్‌ స్ఫూర్తితో..

పవిత్ర మేడమ్‌ స్ఫూర్తితో..2
2/7

పవిత్ర మేడమ్‌ స్ఫూర్తితో..

పవిత్ర మేడమ్‌ స్ఫూర్తితో..3
3/7

పవిత్ర మేడమ్‌ స్ఫూర్తితో..

పవిత్ర మేడమ్‌ స్ఫూర్తితో..4
4/7

పవిత్ర మేడమ్‌ స్ఫూర్తితో..

పవిత్ర మేడమ్‌ స్ఫూర్తితో..5
5/7

పవిత్ర మేడమ్‌ స్ఫూర్తితో..

పవిత్ర మేడమ్‌ స్ఫూర్తితో..6
6/7

పవిత్ర మేడమ్‌ స్ఫూర్తితో..

పవిత్ర మేడమ్‌ స్ఫూర్తితో..7
7/7

పవిత్ర మేడమ్‌ స్ఫూర్తితో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement