
నేరాల కట్టడికి సాంకేతికతను వినియోగించాలి
పర్యావరణాన్ని పరిరక్షించాలి
సూర్యాపేటటౌన్ : నేరాలు కట్టడికి సాంకేతికతను వినియోగించాలని, ప్రజల భాగస్వామ్యంతో పటిష్టంగా పని చేయాలని ఎస్పీ నరసింహ తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అక్రమ రవాణా నిరోధంలో క్షేత్ర స్థాయిలో నిఘా ఉంచాలన్నారు. నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని రికార్డ్స్‌లో నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. విధుల నిర్వహణలో బాగా పనిచేసిన పోలీస్ సిబ్బందికి రివార్డులు అందజేశారు. అదనపు ఎస్పీలు రవీందర్, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, శ్రీధర్‌రెడ్డి, నరసింహచారి, మంజుభార్గవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ
సూర్యాపేటటౌన్ : ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎస్పీ నరసింహ అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో సామూహికంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరసింహ చారి, శ్రీధర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.