
ప్రజలు భక్తిభావం పెంపొందించుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : ప్రజలు భక్తిభావం పెంపొందించుకోవాలని సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. శనివారం అర్ధరాత్రి చివ్వెంల మండల పరిధిలోని శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌర్ణమి నిద్ర రాత్రులు కార్యక్రమంలో వేణారెడ్డి పాల్గొని మాట్లాడారు. శనివారం రాత్రి ఆలయ ప్రాంగణంలో నిద్రించారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జాతర.. పౌర్ణమి రోజు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇక్కడ పౌర్ణమి నిద్ర రాత్రుల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ పోలేబోయిన నర్సయ్య తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ గోపురానికి తీసుకువచ్చిన పసిడి కుండలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కుశలయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజాద్ ఆలీ, కెక్కిరేణి శ్రీనివాస్, తంగెళ్ల కరుణాకర్‌రెడ్డి, రుద్రంగి రవి, పందిరి మల్లేశ్‌గౌడ్, రావుల రాంబాబు, మద్దెబోయిన శ్రీనివాస్, మద్దెబోయిన తిరుమలేష్, నబీఖాన్, జావేద్, సాగర్, లింగమంతులు, సంజయ్, కుర్ర సైదులు, లింగస్వామి, చిన్న మల్లయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు భక్తిభావం పెంపొందించుకోవాలి