బడిలోనే ఆధార్‌ నమోదు.. | - | Sakshi
Sakshi News home page

బడిలోనే ఆధార్‌ నమోదు..

Aug 11 2025 7:39 AM | Updated on Aug 11 2025 7:39 AM

బడిలో

బడిలోనే ఆధార్‌ నమోదు..

నాగారం : ఆధార్‌ కార్డు గుర్తింపు కోసమే కాకుండా వివిధ ప్రభుత్వ పథకాల అమలు, ధ్రువపత్రాల జారీకి అత్యంత కీలకంగా మారింది. ఏ విద్యార్థి, ఏ పాఠశాలలో చదువుతున్నాడు, విద్యార్థుల సంఖ్య వివరాలను ఒక్క క్లిక్‌తో తెలుసుకోవడానికి ప్రభుత్వం యూడైస్‌ నిర్వహిస్తోంది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన ప్రతి విద్యార్థి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఆధార్‌ సంఖ్య తప్పనిసరి. ఏటా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే జిల్లాలో చాలామందికి ఆధార్‌ లేకపోవడం సమస్యగా మారింది. ఆధార్‌కార్డు లేనివారి సంఖ్య వేలాదిగా ఉన్నట్లు విద్యాశాఖ జిల్లా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పాఠశాలల్లో ప్రస్తుతం ఆధార్‌ నమోదు, అప్‌డేట్‌ కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది.

అన్నింటికీ ప్రామాణికం...

పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వ నుంచి బడ్జెట్‌ కేటాయింపులు, ఉపాధ్యాయుల నియామకం, మధ్యాహ్న భోజనం, యూ నిఫాం వంటివి అందుతాయి. జాతీయ ఉపకార వేతనాలకు బ్యాంకు ఖాతా అవసరం కావడం దా నికోసం ఆధార్‌ వివరాలు అత్యంత ప్రామాణికం.

31,203 మంది గుర్తింపు..

విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 21,531 మంది విద్యార్థులకు పేరు సవరణ, 10,846 మందికి పుట్టిన తేదీ సవరణ, మరో 138 మందికి జెండర్‌ మార్పు ఇలా మొత్తం 31,203 మందికి ఆధార్‌ అప్‌డేట్‌ చేయాల్సి ఉన్నట్లు తేలింది. వీరిలో 1, 2, 3 తరగతుల వారే అధికంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. గతంలో ఎమ్మార్సీ కార్యాలయాల్లో శాశ్వత ఆధార్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక కిట్లను కూడా మంజూరు చేశారు. పర్యవేక్షణ లోపం, సిబ్బంది పట్టింపు లేమితో చాలాచోట్ల ఇవి కనుమరుగయ్యాయి. ప్రభుత్వ పరిధిలో కిట్లు అందుబాటులో లేకపోవడంతో విద్యాశాఖ ఓ ప్రైవేటు ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించింది. మండలానికి ఒకరు, అవసరం ఉన్నచోట ఇద్దరు సిబ్బందిని ఏజెన్సీవారు నియమించుకుంటున్నారు. ప్రస్తుతం నియామకమైన 23 మంది ఆయా మండలాల్లో ఆధార్‌ నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. ప్రత్యేక సిబ్బంది నేరుగా పాఠశాలకే వచ్చి కొత్త ఆధార్‌ నమోదుతోపాటు అవసరమైన విద్యార్థులకు ఆధార్‌ అప్‌డేట్‌ చేస్తున్నారు. మార్పు, చేర్పులు, తప్పుల సవరణ, బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేస్తున్నారు.

ఫ 31,203 మందికి ఆధార్‌ నమోదు, అప్‌డేట్‌ చేయాల్సి ఉందని గుర్తింపు

ఫ బాధ్యతలను ఏజెన్సీకి అప్పగించిన ప్రభుత్వం

ఫ పాఠశాలల్లో కొనసాగుతున్న ప్రక్రియ

అప్‌డేట్‌ ప్రక్రియ కొనసాగుతోంది

విద్యార్థుల ఆధార్‌ అప్‌డేట్‌ ప్రక్రియ జిల్లాలోని పాఠశాలల్లో కొనసాగుతోంది. విద్యార్థులకు నూతన ఆధార్‌కార్డు నమోదు, పేర్లు, పుట్టిన తేదీల్లో మార్పులు, చేర్పులు వంటి వారిని ఏజెన్సీ సిబ్బంది పాఠశాలల్లోనే సవరిస్తున్నారు.

–అశోక్‌, డీఈఓ, సూర్యాపేట

బడిలోనే ఆధార్‌ నమోదు..1
1/1

బడిలోనే ఆధార్‌ నమోదు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement