
పింఛన్ల సభను జయప్రదం చేయాలి
నాగారం : చేయూత పింఛన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించే దివ్యాంగుల ఆసరా పింఛన్ల సభను జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి బొజ్జ సైదులు మాదిగ కోరారు. ఆదివారం నాగారం మండల పరిధిలోని పస్తాల గ్రామంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సైదులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ.4వేల నుంచి రూ.6వేలకు, వృద్ధులు, ఒంటరి మహిళలకు రూ.2వేల నుంచి రూ.4వేలకు పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మంద కృష్ణమాదిగ ఈ సభకు హాజరవుతారని, వృద్ధులు, దివ్యాంగులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బొజ్జ అశోక్, బచ్చలకూర వెంకటేశ్వర్లు, రుద్రపంగు సురేష్, వీహెచ్‌పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు చింత సతీష్ మాదిగ, పాల్వాయి బాలయ్య, చెడపక గంగరాజు, కొండగట్టు శ్రీనివాస్, బొంకూరి కృష్ణ, కండే అనిల్, చింతకుంట్ల నరేంద్ర, బొజ్జ సతీష్, మిరియాల చింటూ, బొజ్జ రవి, బొజ్జ వెంకన్న, బొజ్జ బజార్, పోగుల లింగమ్మ, నాతి వెంకన్న, సైదమ్మ, సత్తయ్య, సత్తయ్య చిత్తలూరు సత్తమ్మ, వడ్డకొండ్ల సోమయ్య, మేడే మాణిక్యం, మంగమ్మ, భాగ్యమ్మ, నర్సయ్య, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.
నేడు మంద కృష్ణమాదిగ రాక
తిరుమలగిరి( తుంగతుర్తి ) : చేయూత పెన్షన్‌దారుల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం తుంగతుర్తిలో జరిగే సభకు మంద కృష్ణమాదిగ హాజరవుతారని మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న తెలిపారు. ఆదివారం తొండ, మామిడాల, వెలిశాల తిరుమలగిరి, మాలిపురం గ్రామాల్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు వేముల వెంకన్న అధ్యక్షతన జరిగిన గ్రామసభలకు ఆయన హాజరై మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో సీహెచ్ వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, రాధ, ఎల్లయ్య యాదవ్, రావుల మల్లేష్ మతి లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.