మందుల సామేల్‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్న కోమటిరెడ్డి
తిరుమలగిరి (తుంగతుర్తి) : రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేల్ ఆదివారం హైదరాబాద్‌లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మందుల సామేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు మంత్రి పదవిని త్యాగం చేసిన తెలంగాణ యోధుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో తెలంగాణ విమోచన దినోత్సవం రోజున తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషం కలిగిస్తుందన్నారు. తుంగతుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగుర వేయడానికి కృషి చేస్తానని అన్నారు. తనను పార్టీలోకి ఆహ్వానించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.


