‘సంతకం ఫోర్జరీ చేశారు’ | - | Sakshi
Sakshi News home page

‘సంతకం ఫోర్జరీ చేశారు’

Nov 28 2026 1:56 AM | Updated on Nov 28 2026 1:56 AM

టెక్కలి: టెక్కలి మేజర్‌ పంచాయతీలో 6 వార్డు స్థానానికి నామినేషన్‌ వేసిన అభ్యర్థికి ప్రతిపాదకురాలిగా ఉన్న ఓ మహిళ సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ వార్డు సభ్యురాలి నామినేషన్‌ను తిరస్కరించేశారు. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం... 6వ వార్డు స్థానానికి వైఎస్సార్‌సీపీ మద్దతుతో సత్తారు సరస్వతి నామినేషన్‌ వేశారు. అయితే ఆమె నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని అధికార పార్టీ కార్యకర్తలు ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినప్పటికీ ఆమె తలొగ్గలేదు. దీంతో ఆమెకు ప్రతిపాదకురాలిగా సంతకం చేసిన సత్తారు పద్మావతి సంతకాన్ని ఫోర్జరీ చేసి నామినేషన్‌ను తిరస్కరించి టీడీపీ మద్దతురాలికి ఏకగ్రీవం ఎన్నికగా ప్రకటించేశారు. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement