కూటమి పతనం ఖాయం | - | Sakshi
Sakshi News home page

కూటమి పతనం ఖాయం

Nov 28 2026 1:56 AM | Updated on Nov 28 2026 1:56 AM

● ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికల్లో అక్రమాలు, దాడులు

● ధ్వజమెత్తిన మాజీ మంత్రి

ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రానున్న ఎన్నికల్లో కూటమి పతనం కావడం ఖాయమని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆయన శ్రీకాకు ళం జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడి యా సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా తయారీ నుంచి వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు వరకు అడుగడుగునా అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. చివరకు ఎంపీటీసీల కౌంటింగ్‌ కేంద్రాల్లోనూ లైట్లు ఆర్పేసి, బ్యాలెట్‌ కట్టలను తారుమారు చేస్తూ.. ఓడిన కూటమి అభ్యర్థులకు గెలిచినట్లు సర్టిఫికెట్లు ఇప్పించుకున్నారని ఆరోపించారు. ఇంతటి నిర్బంధం, రక్తపాతం సృష్టించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధించడమే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు నిదర్శనమని, రానున్న 2029 ఎన్నికల్లో ప్రజలు ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు.

రాజ్యాంగ దినోత్సవం

నాడే అక్రమ నిర్బంధం

కౌంటింగ్‌ ప్రక్రియలో అక్రమాల ను అడ్డుకోవడానికి తాను జనరల్‌ ఏజెంట్‌గా వెళ్తానని చెబితే, సీఎం పేషీ నుంచి ఎస్పీ, కలెక్టర్‌లకు ఆదేశాలు ఇప్పించి అక్రమంగా గృహ నిర్బంధం చేశారన్నారు. రాజ్యాంగ పరిరక్షణ దినం నాడే తనను నిర్బంధించి రాజ్యాంగ వ్యతిరేక చర్యకు పాల్పడటం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. శ్రీకాకుళంలో పోలింగ్‌ సజావుగా జరిగిందని ఎక్కడా రిగ్గింగ్‌ జరగలేదని అయినా నిబంధనలకు విరుద్ధంగా తనను నిర్బంధించడం మాత్రం ఘోర తప్పిదమన్నారు.

ఇది ప్రజా విజయం

ప్రభుత్వం ఇన్ని పన్నాగాలు పన్నుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సర్పంచ్‌ స్థానాలు గెలుచుకున్నారని తెలిపారు. శ్రీకాకుళంలో జరగబోయే కౌంటింగ్‌ ప్రక్రియలో ఏజెంట్లు, అడ్వకేట్లు, నేషనల్‌ మీడియా సమక్షంలో అత్యంత పక్కాగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులను సైతం ఉపేక్షించేది లేదని, పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement