సారవకోట: బుడితి గ్రామంలో గురువారం రాత్రి ఫైలేరియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు సారవకోట పీహెచ్‌సీ వైద్య సిబ్బంది నిర్వహించా రు. ఉన్నతాధికారుల నుంచి బుడితి గ్రామంలో ఫైలేరియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సూచించడంతో నాలుగు బృందాలుగా ఏర్పడి పరీక్షలు చేపట్టారు. వీటిని ఉన్నతాధికారుల సూచనలు మేరకు ల్యాబ్‌లకు పంపిస్తామని వైద్యాధికారి సుధారాణి తెలిపారు.
జాడుపూడి గ్రామస్తులపై ఎస్‌ఐ దాడి
● ఎస్సై తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
కంచిలి: మండలంలోని జాడుపూడి గ్రామంలో పలువురిపై కంచిలి ఎస్‌ఐ పి.పారినాయుడు గురువారం రాత్రి విచక్షణారహితంగా దాడి చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ మద్దతుదారు పలికల జయరాం పంచాయతీ సర్పంచ్‌గా గెలు పొందడంతో, అతడిని గ్రామస్తులు స్థానిక దేవాలయానికి తీసుకెళ్లి, తిరిగి వస్తుండగా అదే సమయంలో అక్కడకు వచ్చిన ఎస్‌ఐ పి.పారినాయుడు అనుమతి లేకుండా ఊరేగింపు చేశారనే కారణంగా దాడి చేశారు. దీంతో వారంతా భయాందోళనకు గురై పరుగులు తీశారు. గాయాలపాలైన వారిలో గ్రామానికి చెందిన పిలక మహాలక్ష్మి, పిలక కమలమ్మ, పిలక హైమావతి, అనపాన పురుషోత్తం, బొయిరిశెట్టి వల్లభ రావు, పిలక ఆదయ్య, పలికల కుశరాజు ఉన్నట్లు తెలిపారు. వీరిలో కొందరికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ స భ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విష యం తెలుసుకొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్ఛాపురం సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్‌రెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ పైల దేవదాస్‌రెడ్డిలు శుక్రవారం గ్రామానికి వచ్చి ఆయా కుటుంబాలను పరామర్శించారు. కంచిలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడకు వచ్చిన కాశీబుగ్గ డీఎస్పీ జీవీ రమణ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీనిపై ఎన్నికల సంఘాని కి ఫిర్యాదు చేస్తామన్నారు.


