అడ్డదారిలో ఆమదాలవలస బస్సు | - | Sakshi
Sakshi News home page

అడ్డదారిలో ఆమదాలవలస బస్సు

Nov 28 2026 1:56 AM | Updated on Nov 28 2026 1:56 AM

● బ్యాలెట్‌ బాక్సులతో వెళ్తున్న బస్సు రూట్‌

మార్చే యత్నం

● ప్రయత్నాన్ని అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

ఆమదాలవలస: ఆమదాలవలస మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థి కూన ప్రమీలను గెలిపించేందుకు అధికార పార్టీ అన్ని అడ్డదారులు తొక్కుతోంది. గురువారం పోలింగ్‌ జరిగిన రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎమ్మెల్యే మెట్టక్కివలస ప్రాంతంలోనే ఉంటూ రిగ్గింగ్‌ చేయాలని ప్రయత్నించగా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బొడ్డేపల్లి అజంతాకుమారి భర్త బొడ్డేపల్లి రమేష్‌కుమార్‌ ముందు ఆయన పప్పులు ఉడకలేదు. ఎన్నిక తర్వాత బ్యాలెట్‌ బాక్సులు చిలకపాలెం శివాని కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించే సమయంలో.. మెట్టక్కివలసలోగల 11, 13, 14 వార్డులకు సంబంధించిన బాక్సులు ఉన్న బస్సును దారి మళ్లించారు. దీనిపై మొదటి నుంచీ అనుమానం ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులు బస్సు వెనక వీడియోలు తీసుకుంటూ వాహనాలతో ఫాలో అయ్యా రు. బొడ్డేపల్లి రమేష్‌కుమార్‌ డ్రైవర్‌, రూట్‌ ఆఫీసర్లను నిలదీశారు. దీనికి వారు రూటు తప్పిపోయాం అందుకే ఇలా వెనక్కి ముందుకు వస్తున్నామని సమాధానం చెప్పడంతో బస్సు కౌంటింగ్‌ కేంద్రానికి వెళ్లే దాకా అనుసరించారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని రమేష్‌ కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement