ఆమదాలవలసలో.. | - | Sakshi
Sakshi News home page

ఆమదాలవలసలో..

Nov 26 2026 1:53 AM | Updated on Nov 26 2026 1:53 AM

ఆమదాలవలస: మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వార్డుల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన 28 వార్డుల పరిధిలో మొత్తం 33,067 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 44 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఎన్నికల విధుల నిర్వహణకు 20 శాతం రిజర్వ్‌ సిబ్బందితో కలిపి మొత్తం 315 మంది సిబ్బందిని నియమించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా 16 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా, 7 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా (సెన్సిటివ్‌), మిగిలిన 21 కేంద్రాలను సాధారణ కేంద్రాలుగా గుర్తించారు. ఈ నెల 30న నిర్వహించే ఓట్ల లెక్కింపు కోసం చిలకపాలెంలోని శివాని ఇంజినీరింగ్‌ కళాశాలలో స్ట్రాంగ్‌ రూమ్‌లు కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement