నాడు వెలుగులు..
నేడు చీకట్లు
● వైఎస్ జగన్ హయాంలో ఇంటింటా సంక్షేమ పథకాలు
● చంద్రబాబు పాలనలో ఆగిన సంక్షేమం
● నయవంచనపై నారీలోకం ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
‘అధికారంలోకి వస్తే ప్రతి ఆడబిడ్డ ఖాతాలో నెలకు రూ.1500 (ఆడబిడ్డ నిధి) వేస్తాం. డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాం. నిరుద్యోగ యువతికి నెలకు రూ.3 వేలు చొప్పున ఇస్తాం. ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం..’ అని హామీలిచ్చిన చంద్రబాబు కుర్చీ దక్కాక మాట మర్చిపోయారు. నాడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమైన వందల కోట్ల రూపాయలు నేడు ఎక్కడికి పోయాయని అక్కచెల్లెమ్మలు ప్రశ్నిస్తున్నారు.
గత వైఎస్సార్‌సీపీ పాలనలో గ్రామీణ, పట్ణణ ప్రాంత మహిళల ఆర్థిక స్వావలంబనకు స్వర్ణయుగం నడిచింది. ఎలాంటి పైరవీలు, అంచనాలకు తావులేకుండా బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ అయ్యేది. డ్వాక్రా రుణాల మాఫీ సొమ్ము, 45 ఏళ్లు దాటిన మహిళలకు చేయూత కింద రూ.18,750, వడ్డీ భారం పడకుండా సున్నా వడ్డీ రుణం, లక్షలాది మంది పేద అక్కచెల్లెమ్మల పేరుతో ఉచితంగా ఇళ్ల పట్టాలు, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, జగనన్న తోడు తదితర పథకాలతో ప్రతి వర్గానికి అండగా నిలిచారు.
చంద్రబాబు అఽధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళల సంక్షేమంపై కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. ఆడబిడ్డ నిధికి మంగళం పాడేశారు. ఉచిత సిలిండర్లను గాలికొదిలేశారు. సున్నా వడ్డీ రుణాల ఊసేలేదు. నిరుద్యోగ భృతి జోలికి వెళ్లలేదు. గత ప్రభుత్వం అందించిన ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాలను పూర్తిగా నిలిపివేశారు. సీ్త్రలకు కొండంత భరోసాగా ఉండే దిశ యాప్‌ను సైతం నిర్వీర్యం చేశారు.
వైఎస్ జగన్ హయాంలో..
● 2019 ఏప్రిల్ నాటికి బకాయి ఉన్న రుణ మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లిస్తూ వైఎస్సార్ ఆసరా పథకాన్ని అందించారు.
● ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాల్లో 45 నుంచి 60 ఏళ్ల వయసు గల పేద మహిళలు ఆర్థికంగా నిలబడేలా వైఎస్సార్ చేయూత అమలు చేశారు. అప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసిన సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేశారు.
● పిల్లలు చదువులు, ఇతరత్రా వాటి కోసం అమ్మ ఒడి, విద్యా కానుక, వసతి దీవెన, విద్యావసతి కార్యక్రమాల కింద సాయం అందించారు.
● వైఎస్సార్ చేయూత పథకంతో పశువులు, కోళ్లు పెంపకం, పాడి, కిరాణా వ్యాపారం, చేనేత, వస్త్ర వ్యాపారం, గొర్రెల, మేకల పెంపకం తదితర లాభసాటి ఉత్పత్తుల తయారీకి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది.
● వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చే నాటికి డ్వాక్రా సంఘాల సభ్యులకు రూ.1515.86 కోట్లు రుణం ఉంది. దీంట్లో గ్రామీణ ప్రాంతానికి సంబంధించి రూ.1364.81 కోట్లు కాగా, పట్టణ ప్రాంతానికి సంబంధించి రూ.151.06కోట్లు ఉంది. ఆ సొమ్ము ను నాలుగు దఫాలుగా చెల్లింపులు చేసింది.
● వైఎస్సార్ సున్నా వడ్డీ కింద బ్యాంకుల నుంచి డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలపై పడిన వడ్డీ తిరిగి చెల్లించే కార్యక్రమం కింద 2020లో 48,634 సంఘాల్లోని 5,48,723 మందికి రూ. 31.68 కోట్లు, రెండో విడత కింద 53,950 సంఘాలకు రూ.31.92 కోట్లు చెల్లించింది.
● జగనన్న అమ్మఒడి కింద 2020లో 2,41,562 మందికిరూ.362.34 కోట్లు, 2021లో 3,48,331 మందికి రూ.487.86 కోట్లు చెల్లించింది.
● లక్షా 10 వేల 825మంది మహిళలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు అందజేశారు.


