రెండో విడతలో 46 సర్పంచ్‌లు, 1090 వార్డు స్థానాలు ఏకగ్రీవం | - | Sakshi
Sakshi News home page

రెండో విడతలో 46 సర్పంచ్‌లు, 1090 వార్డు స్థానాలు ఏకగ్రీవం

Nov 26 2026 1:53 AM | Updated on Nov 26 2026 1:53 AM

అరసవల్లి:జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడతలో ఆమదాలవలస, పాతపట్నం, ఎచ్చెర్ల, నియోజకవర్గాల పరిధిలో 388 గ్రామ పంచాయతీలు, 3618 వార్డు స్థానాల్లో ఎన్నికలకు సన్నాహాలు చేయగా.. ఇందులో 46 సర్పంచ్‌లు, 1090 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయని జిల్లా పంచాయతీ అధికారి, అదనపు జిల్లా ఎన్నికల అధికారి స్వరూపారాణి బుధవారం ప్రకటించారు. ఈ నెల 29న 342 గ్రామ పంచాయతీలు, 1090 వార్డు స్థానాలకు పోలింగ్‌ జరుగుతుందని చెప్పారు. సర్పంచ్‌ స్థానాలకు 825 మంది, వార్డు స్థానాలకు 5419 మంది బరిలో ఉన్నారని వివరించారు. మెళియాపుట్టి మండలంలో 8 పంచాయతీలు, 147 వార్డులు, పాతపట్నంలో 7 పంచాయతీలు, 130 వార్డులు, కొత్తూరులో 6 పంచాయతీలు, 104 వార్డులు, ఎల్‌ఎన్‌పేటలో 5 పంచాయతీలు, 86 వార్డులు, జి.సిగడాంలో 4 పంచాయతీలు, 97 వార్డులు, హిరమండలంలో 4 పంచాయతీలు, 63 వార్డులు, పొందూరులో 4 పంచాయతీలు, 76 వార్డులు, రణస్థలంలో 2 పంచాయతీలు, 64 వార్డులు, సరుబుజ్జిలిలో 2 పంచాయతీలు, 48 వార్డులు, బూర్జలో ఒక పంచాయతీ, 78 వార్డులు, ఎచ్చెర్లలో ఒక పంచాయతీ, 47 వార్డులు, లావేరులో ఒక పంచాయతీ, 68 వార్డులు, ఆమదాలవలసలో 82 వార్డులు ఏకగ్రీవమయ్యాయని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement