నాడు చేతలు.. నేడు మాటలు | - | Sakshi
Sakshi News home page

నాడు చేతలు.. నేడు మాటలు

Nov 26 2026 1:53 AM | Updated on Nov 26 2026 1:53 AM

● వైఎస్‌ జగన్‌ హయాంలో జిల్లా కేంద్రంలో ప్రగతి పనులు

● నేడు ఆర్భాటానికే పెద్దపీట వేస్తున్న

టీడీపీ నాయకులు

● పాత పనులకు రంగులేసి ప్రచారం చేసుకుంటున్న వైనం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రగతి పనులు చూసిన జిల్లా కేంద్రం.. నేడు నాయకుల ప్రచార ఆర్భాటాలు చూసి విస్తుపోతోంది. మాటలు కాదు.. చేతలే ముఖ్యం అన్నట్టుగా వైఎస్‌ జగన్‌ పాలనలో నగరంలో జరిగిన అభివృద్ధి పనులు కళ్లముందే కనిపిస్తుంటే.. టీడీపీ నేతలు మాత్రం పాత పనులకు కొత్త రంగులు వేసుకుంటూ, పునర్నిర్మాణం పేరుతో కూల్చివేతలు, మీడియా మేనేజ్‌మెంట్‌తో కాలం వెల్లదీస్తున్నారు. నాడు–నేడు కింద స్కూల్స్‌ అభివృద్ధి, సచివాలయాలు, అర్బన్‌ హెల్త్‌ కేంద్రాలు నిర్మాణం, అంతర్గత రోడ్లు, తదితర శాశ్వత పనులతో వైఎస్సార్‌సీపీ శిఖరాన నిలిస్తే.. కేవలం పబ్లిసిటీ పనులతో టీడీపీ చీప్‌ ట్రిక్స్‌ వాడుతోంది.

వైఎస్‌ జగన్‌ పాలనలో జరిగిన అభివృద్ధి

● గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా రూ.5.80 కోట్లతో 72 రోడ్లు, డ్రైనేజీల పనులు చేపట్టారు.

● నగరంలో పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ పరిధిలోకి రాని 37బీటీ రోడ్లును రూ.10.50 కోట్లతో పునర్నిర్మాణం చేపట్టారు.

● రూ.1.40 కోట్లతో కలెక్టరేట్‌ దగ్గర ప్రత్యేకంగా స్మార్ట్‌ సిటీ రోడ్డు నిర్మించారు.

● కార్పొరేషన్‌లో విలీనమైన పంచాయతీల్లో రూ.3 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ పనులు చేశారు.

● నగర సుందరీకరణలో భాగంగా రూ.75 లక్షలతో మ్యురల్‌ పెయింటింగ్స్‌, రూ.1.68 కోట్లతో మొక్కలు నాటారు.

● డే అండ్‌ నైట్‌ జంక్షన్‌ దగ్గరలోని నాగావళి పక్కన రూ.1.40 కోట్లతో గ్యాస్‌తో రన్‌ అయ్యే శ్మశాన వాటికను నిర్మాణం చేపట్టారు.

శాశ్వత పనులు

● రోడ్లు, డ్రైనేజీ పనులే కాకుండా నగరంలోని పలు శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అస్తవ్యస్తంగా ఉన్న పొట్టి శ్రీరాముల మార్కెట్‌ను రూ.2.20 కోట్లతో ఆధునీకరించారు.

● బలగలో ఉన్న మంచినీటి ప్రాజెక్టును 5 ఎంఎల్‌డీ అదనపు సామర్థ్యంతో నీరు సరఫరా చేసేందుకు రూ.2.50 కోట్లతో అభివృద్ధి చేశారు.

● ఒక్కో పట్టణ ఆరోగ్య కేంద్రానికి రూ.కోటి చొప్పున కేటాయించి రూ.4 కోట్లతో నాలుగు పట్టణ ఆరోగ్య కేంద్రాలను నిర్మించారు.

● రూ.3.70 కోట్లతో నగరంలోని ఆరు పార్కులను ఆధునీకరించారు.

● మరో రూ.2.20 కోట్లతో విజయాధిత్య పార్కు అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.

● నాడు–నేడు కింద రెండు దశల్లో రూ.15.65 కోట్లతో 34 పాఠశాలలను అభివృద్ధి చేశారు.

● అరసవల్లి ఇంద్ర పుష్కరిణి ఆధునికీకరణ కోసం రూ.4 కోట్లు పనులకు శ్రీకారం చుట్టారు.

● టీడీపీ ప్రభుత్వం సగంలో వదిలేసిన టిడ్కో ఇళ్లను సుమారు రూ.20 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు.

● పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలు, రోడ్లు, వాటర్‌, డ్రైనేజీ సదుపాయాలు, మురుగునీరు శుద్ధీకరణ కోసం ఖర్చు పెట్టారు.

● శ్రీకాకుళం అంబేడ్కర్‌ జంక్షన్‌ నుంచి ఆమదాలవలస బ్రిడ్జి ప్రారంభ భాగం వరకు 10 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులను చేపట్టారు.

● ఫిష్‌ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పాలిటెక్నిక్‌ కళాశాల రోడ్డులో 26 షాపులను ఏర్పాటు చేశారు.

● ఇంటింటి చెత్త సేకరణకు 42 స్వచ్ఛ వాహనాలు ఏర్పాటు చేశారు. చెత్తను లిఫ్ట్‌ చేసే ఏడు పెద్ద వాహనాలు, 240 డంపర్‌ బిన్నులు, రెండు పెద్ద స్వీపింగ్‌ మిషన్లు, రెండు చిన్న స్వీపింగ్‌ మిషన్లు సమకూర్చారు. ఇప్పుడా వాహనాలతోనే చెత్త సేకరణ చేస్తున్నారు. పాడైపోయినవి ఏకంగా పక్కన పెట్టేశారు.

● రూ.73 లక్షలతో పూడికలు తీసేందుకు మినీ ఎక్స్‌వేటర్‌, రోడ్లపై ఉన్న దూళి ఎగరకుండా ఉండేలా తడిపేందుకు స్ప్రింకర్లతో కూడిన వాటర్‌ ట్యాంక్‌ను, రోడ్లపై ఉన్న దుమ్ము దూళిని తొలగించే మెకానికల్‌ స్వీపర్‌ను కొనుగోలు చేసి కార్పొరేషన్‌కు అందుబాటులో తెచ్చారు.

● రూ.21 కోట్లతో తండేవలస డంప్‌ యార్డ్‌లో ఉన్న 2.37లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను బయో రెమిడియేషన్‌ ఆఫ్‌ లెగసీ కింద క్లీనింగ్‌ చేసే పనులు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement