పాతపట్నం: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అక్రమ మద్యం, నగదు రవాణాను అరికట్టేందుకు ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నామని పాతపట్నం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. బుధవారం పాతపట్నం సరిహద్దు ఎ.ఎస్.కవిటి, బైదలాపురం కూడలి వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల సమయంలో వాహనాల ద్వారా అక్రమంగా మద్యం, నగదు తరలించే అవకాశం ఉన్నందున, నిరంతర వాహన తనిఖీలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించామన్నారు. తనిఖీల్లో ఎస్‌ఐ వాసుదేవరావు, పోలీసులు పాల్గొన్నారు.
బైదలాపురం కూడలి వద్ద వాహనాలను
తనిఖీలు చేపడుతున్న దృశ్యం


