సారవకోట: మండలంలోని పెద్దలంబ, చిన్నకిట్టాలపాడు పంచాయతీలకు చెందిన పలువురు టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బుధవారం చేరారు. పెద్దలంబ పంచాయతీ నుంచి కొంచాడ భాస్కరరావు, వండాన రామన్న, పెనుబోకల బాబూరావు, చిన్నకిట్టాలపాడు పంచాయతీ నుంచి బుర్రా రాములతో పాటు మరికొంత మంది పార్టీలో చేరగా.. వారికి పోలాకి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ధర్మాన కృష్ణ చైతన్య పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి యాళ్ల శ్యామసుందరరావు, పార్టీ మండల కమిటీ ఉపాధ్యక్షుడు బొంగు కొండయ్య, మాజీ సర్పంచ్లు పల్లి కృష్ణారావు, ఇసై షణ్ముఖరావు, బూర్లె మోహనరావు తదితరులు పాల్గొన్నారు.


