డబ్బుకు దాసోహం | - | Sakshi
Sakshi News home page

డబ్బుకు దాసోహం

Nov 20 2026 2:30 AM | Updated on Nov 20 2026 2:30 AM

సహకారం.. సన్నద్ధంపీఏసీఎస్‌ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 13 ఏళ్ల తర్వాత కొత్త పాలకవర్గాలు రానున్నాయి. –8లో ఎన్నికలను బహిష్కరించిన కుశాలపురం

న్యూస్‌రీల్‌

శ్రీకాకుళం
సహకారం.. సన్నద్ధంపీఏసీఎస్‌ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 13 ఏళ్ల తర్వాత కొత్త పాలకవర్గాలు రానున్నాయి. –8లో

● కూటమిలో కార్పొరేటర్ల సీట్ల విక్రయాలు

● అమ్మకాల్లో కీలకంగా వ్యవహరించిన టీడీపీ, జనసేనకు చెందిన ఇద్దరు

● మోసపోయిన సీనియర్లు

● తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న ఆశావహులు

శుక్రవారం శ్రీ 20 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

‘డబ్బులు తీసుకుని డ్రామాలు ఆడుతున్నారు’

శ్రీకాకుళం: కార్పొషన్‌ ఎన్నికలు కూటమిలో నిప్పు రాజేశాయి. అరసవల్లి పరిధిలోని 6వ డివిజన్‌లో టీడీపీకి చెందిన సీనియర్‌ నేత, మాజీ కౌన్సిలర్‌ తెలుగు నాగరత్నం మరోసారి టిక్కెట్‌ కోసం నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఐవీఆర్‌ఎస్‌ పోల్‌ అనే నెపం చూపిస్తూ.. శ్రీశయన వీధికి చెందిన దండాసి జ్యోతిభాస్కర్‌ భార్య ప్రభావతికి బి–ఫారం ఇవ్వడంపై నిప్పులు చెరిగారు. నాగరత్నం కుటుంబంతో పాటు టీడీపీ జిల్లా కార్యదర్శి రా యిపల్లి అర్జున్‌ కుటుంబం, మరో ఇద్దరు అభ్య ర్థులతో గురువారం కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఇంటి వద్ద పంచాయితీ పెట్టారు. అయితే పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సిఫారసు మేరకు జ్యోతిభాస్కర్‌ భార్యకు బి–ఫారం ఇస్తున్నట్లుగా చెప్పడంతో స్థానిక టీడీపీ నేతలు మండిపడ్డారు. పలాస నేతకు ఇక్కడ పనేంటి? ఇక్కడ రాజకీయాలు చేస్తారా.. అంటూ విమర్శించారు. అంతటితో ఆగకుండా నాగరత్నం భర్త తాతబాబు వాగ్వాదం చేస్తూ.. ఒక దశలో ఎమ్మెల్యే శంకర్‌పై దూసుకెళ్లారని సమాచారం. పరిస్థితి అదుపు తప్పడంతో ఎమ్మెల్యే తన నిర్ణయాన్నే అంతా పాటించాలని ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో వెంటనే ‘తెలుగు’ కుటుంబం బయటకు వచ్చి కేంద్రమంత్రి ఇంటి ముందే నిరసనకు దిగారు. డబ్బులు తీసుకుని ఎమ్మె ల్యే డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. సత్తా చూపిస్తామంటూ వార్నింగ్‌ ఇచ్చారు. ‘మేమంతా అప్పట్లో సపోర్ట్‌ చేస్తేనే నువ్‌ ఎమ్మెల్యేవి అయ్యావ్‌’ అంటూ ఓ దశలో తాతబాబు తీవ్ర స్థాయిలో మండిపడినట్లుగా తెలుస్తోంది. ఇక నాగరత్నంతో పాటు వచ్చిన మరో ఆశావాది రాయిపల్లి అర్జున్‌ సన్నిహితులు కూడా ఎమ్మెల్యే వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు తెలుగు నాగరత్నం శుక్రవారం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా సమాచారం.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కార్పొరేషన్‌లో విలీ నం చేసి, ఎన్నికలు నిర్వహించడాన్ని నిరసిస్తూ కుశాలపురం గ్రామ ప్రజలు ఎన్నికలు బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్లు వేసి న 13 మందిని విత్‌ డ్రా చేయించారు. తొలుత టీడీపీకి చెందిన అభ్యర్థులు బరిలో ఉంటామని తటపటాయించినా గ్రామస్తులంతా ఏకమై.. బరిలో ఉంటే ఓడిస్తామని గట్టిగా హెచ్చరించడంతో నామినేషన్లు ఉపసంహరించుకోక తప్పలేదు. కార్పొరేషన్‌లో తమ గ్రామాన్ని విలీనం చేయడానికి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. సుప్రీంకోర్టు వరకు పిటీషన్లు వేశారు. చివరకు ఎన్ని క లు బహిష్కరిస్తూ తీర్మానం చేసుకున్నారు. దాని లో భాగంగానే నామినేషన్లు వేసిన వారందరినీ ఒత్తిడి చేసి, విత్‌ డ్రా చేయించారు. అంతేకాకుండా బూత్‌ ఏర్పాటు చేస్తే ఓటు వేసేందుకు ఎవరూ వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

‘కూటమిలో కార్పొరేటర్‌ టిక్కెట్లు అమ్ము కున్నారు. టీడీపీలో ఒకరు, జనసేనలో ఒకరు టిక్కె ట్లు అమ్ముకుని, సీనియర్లకు మొండి చేయి చూపా రు. కౌంటర్లు తెరిచి మరీ కార్పొరేటర్‌ స్థానాలను అంగడి సరుకులా మార్చేశారు..’

ఈ మాట అంటున్నది విపక్ష నాయకులు కా దు.. సాక్షాత్తు టీడీపీ నాయకులే. నామినేషన్ల విత్‌ డ్రా కేంద్రం వద్ద, ఎంపీ కార్యాలయం ఎదుట, ఎ మ్మెల్యే కార్యాలయం వద్ద టిక్కెట్లు దక్కని సీనియర్‌ నాయకులు బాహాటంగా తమ ఆవేదనను వెళ్లగక్కా రు. కన్నీరు పెడుతూ ఆవేదన చెందారు.

టీడీపీలో అసంతృప్తి జ్వాలలు మిన్నంటాయి. సీనియర్లకు మొండి చేయి చూపించి, క్యాష్‌ కొట్టిన వాళ్లకే పదవులు కట్టబెట్టారన్న ఆరోపణలు ఉన్నా యి. అటు టీడీపీలో, ఇటు జనసేనలో ఓ ఇద్దరు నేతలు బీఫారాలు ఇచ్చే వరకు బేరసారాలు సాగించారు. ఎవరైతే భారీగా ముట్టజెప్పారో వారికే చివరికి బీ ఫారాలు ఇచ్చారని ఆ పార్టీ నాయకులే నిర సన తెలియజేశారు. 80 అడుగుల రోడ్డులో ఉన్న కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఇంటి ఎదుట టీడీపీ సీనియ ర్‌ నాయకులు తెలుగు తాతబాబు, నాగరత్నం నిరసన తెలియజేశారు. కార్పొరేటర్‌ స్థానాన్ని అమ్ముకున్నారని అక్కడ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత దండేశారో లెక్క తేల్చుతామని అన్నారు. ఇదే డివిజన్‌కు చెందిన రాయపల్లి అర్జున్‌ కూడా కేంద్రమంత్రి కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. తనను నమ్మించి మోసం చేశారని వాపోయారు.

అరసవల్లిలో కారాలు మిరియాలు

అరసవల్లిలోని 6వ డివిజన్‌లో టీడీపీ సీనియర్లు కారాలు మిరియాలు నూరారు. టిక్కెట్‌ ఆశించిన వారిలో తెలుగు, రాయపల్లి కుటుంబాలకు చివరి వరకు ఆశ చూపించి, ఆఖరి క్షణంలో దండాసి ప్రభావతికి ఖరారు చేశారు. దీంతో ఆ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తామంటూ బహిరంగంగా సవాల్‌ విసిరారు. 6వ డివిజన్‌లో మాజీ కౌన్సిలర్‌ తెలుగు ఆదిలక్ష్మి, తెలుగు ఇందిర, రాయపల్లి స్నేహ, దోర లావణ్య, బొమ్మాళి నాగమణి, తెలుగు పద్మావతి, జాక భాగ్యవతి తదితరులు టిక్కెట్‌ ఆశించి నామినేషన్లు వేశారు. ఎమ్మెల్యే గెలుపు కో సం కష్టపడిన వీరు అప్పటి నుంచి ఆయ న వెంట నడుస్తున్నారు. తమకు టిక్కెట్‌ వస్తుందని ఆశించారు. పెద్దల నుంచి కూడా ఆశలు కల్పించారు. చివరి నిమిషంలో ఆశావహులందరికీ ఝలక్‌ ఇచ్చారు.

ఆశ చూపించి.. మొండి చేయి

36వ డివిజన్‌లో టీడీపీ నుంచి భాస్కర్‌, సంతోష్‌లను నామినేషన్‌ వేయమని టీడీపీ పెద్దలే చెప్పా రు. దీంతో వారిద్దరు నామినేషన్లు వేశారు. చివరి క్షణంలో వారిని కాదని జనసేనకు చెందిన నాగభూషణ్‌కు ఖరారు చేయడంతో వారిద్దరు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. 49వ డివిజన్‌లో టీడీపీ, జనసేనకు చెందిన ఇద్దరు నాయకులకు ఆ పార్టీలు బీ ఫారాలు ఇచ్చి డ్రామాలాడాయి. ఇలా నగరంలో అనేక చోట్ల టిక్కెట్లు ఇస్తామని చూపించి టీడీపీ పెద్దలు మోసం చేశారు. వీరిచ్చిన ఝలక్‌తో నామినేషన్లు వేసిన ఆశావహులు కూడా ఎదురు తి రిగారు. తమ నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు మొండికేశారు. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు ముగియాల్సిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పొద్దు పోయే వరకు అధికారులపై ఒత్తిడి చేసి, కొనసాగించారు.

నేడు జెడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నిక

నామినేషన్‌ ప్రాంగణంలో జనసేన అభ్యర్థి తేజతో పాటు ఎమ్మెల్యే పీఏ, టీడీపీ నాయకులతో మాట్లాడుతున్న ఆర్‌ఓ శాంతారావు

అరసవల్లి: జిల్లా పరిషత్‌ పీఠం ఎవరిదో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. మొత్తం 30 మండలాల్లో 29 జెడ్పీటీసీలను కూటమి పార్టీల అభ్యర్థులు గెలిచారు. నరసన్నపేటలో మాత్రం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పంచిరెడ్డి సత్యనారాయణ గెలుపొందారు. పంచాయతీరాజ్‌ శాఖ చట్టం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశం కోసం నోటీసులు జారీ చేయనున్నారు. ముందు గా కో–ఆప్షన్‌ మెంబర్ల నామినేషన్లు, ఎన్నిక అనంతరం జెడ్పీటీసీలతో పాటు ఈ ఇద్దరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఎవరనేది సీల్డ్‌ కవర్‌లో పేరు వెల్లడికానుంది. ఆక్వాన్‌ తుఫాన్‌ ప్రభావం ఉద్దాన మండలాల్లో తీవ్రంగా చూపించనున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకార సమయానికి ఆయా పరిధి జెడ్పీటీసీల రాకపోకలపై కొంత సందిగ్ధత నెలకొంది.

వలస నేతలకు దెబ్బకొట్టిన టీడీపీ

కార్పొరేటర్‌ టిక్కెట్‌ ఇస్తామని పార్టీలో చేర్చుకున్న నాయకులను కూడా టీడీపీ మో సం చేసింది. తమ సహజ ధోరణిలో వారందరికీ ఝలక్‌ ఇచ్చింది. ముఖ్యంగా పైడి రాజారావు, పైడి మహేశ్వరరావు, గురుగుబిల్లి లోకనాథం, బిర్లంగి రామ్మోహన్‌ తదితర నాయకులను నమ్మించి మోసగించింది. ఎన్నో ఆశలు పెట్టుకుని పార్టీలో చేరితే మిమ్మల్ని నమ్మబోమని పక్కన పెట్టేశారు.

శ్రీకాకుళంలో జనసేన అభ్యర్థులతో

బలవంతంగా విత్‌డ్రాలు

నిబంధనలకు విరుద్ధంగా 3గంటల తర్వాత విత్‌డ్రాలు

7 గంటల వరకు ఎమ్మెల్యే పీఏ, బంధువుల హడావుడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement