సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విత్‌డ్రాలు నాటకీయ పరి ణా మాల మధ్య సాగాయి. ఎన్నికల నియమ నిబంధనల మేర ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటలతో విత్‌డ్రాలు పూర్తిచేయాలి. ఇక్కడ మా త్రం అవేమీ కానరాలేదు. రాత్రి 7గంటల వరకు వి త్‌డ్రాలకు ఆర్‌ఓలు అవకాశం కల్పించడం విశేషం. ఆర్‌ఓలకు పోలీసులు తోడవ్వడంతో బలవంతంగా జనసేన కార్పొరేట్ అభ్యర్థుల చేత ఎమ్మెల్యే పీ ఏ, బంధువులు నామినేషన్లు విత్‌డ్రా చేయించారని వారు చెప్పడం మరో విశేషం. వాస్తవానికి జనసేన కు 15 బీ ఫారాలు ఇచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యే మాత్రం కేవలం జనసేనకు 6 కార్పొరేటర్ల సీట్లు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే జనసేన మాత్రం 15 మందిని బరిలోకి దించాలని నిర్ణయించి అందరికీ బీ–ఫారాలు ఇచ్చేసి సెల్‌ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేసేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మధ్యాహ్నం 3గంటల తర్వాత ఒక్కొ క్కరికీ ఎమ్మెల్యే, అనుచరులు, ఫోన్‌లు చేసి విత్‌డ్రా అవ్వా లని ఒత్తిడి చేశారు. దీంతో ఏం చేయాలో తెలీక తప్పని పరిస్థితుల్లో విత్‌డ్రా సమయం ముగిశాక కూడా విత్‌డ్రా ప్రక్రియ కొనసాగింది.
● 56వ డివిజన్ ఆదివారంపేట కార్పొరేట్ సీటు జనసేనకు తేజకు అవకాశం కల్పించారు. తేజతో మంతనాలు చేసి రూమ్ నంబర్ 4కి సంబంధించిన ఆర్‌ఓ శాంతారావు సాయంత్రం 6.10కు విత్‌డ్రాలు చేయించారు.
● 24వ డివిజన్ దమ్మలవీధికి చెందిన రావాడ కా మేశ్వరరావు సుమారు రెండు మూడు గంటలు పాటు ఫోన్‌లో మాట్లాడి చాలా బాధపడుతూ ఇస్తామని చెప్పి ఇంత మోసం చేయడం సరి కాదని చివరకు సాయంత్రం 6.48 నిమిషాలకు విత్‌డ్రా చేసుకున్నారు. ఆర్‌ఓ జరజాపు శ్రీనివాసరావు విత్‌డ్రా చేయించారు.
సాయంత్రం 6.10 నిమిషాలకు తేజ విత్‌డ్రా చేస్తున్న దృశ్యం
పోలీసుల హడావిడి
నామినేషన్ కేంద్రం వద్ద కూటమి నేతలు, ఎమ్మె ల్యే పీఏ గంటల కొద్ది ఆ ప్రాంగణంలో ఉన్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించారు. అక్కడ జరుగుతున్న అక్రమాలను కెమెరాలో ఫొ టోలు తీస్తే మాత్రం బలవంతంగా డిలీట్ చేయించడం దారుణం. కూటమి నేతలు గోడలు గెంతి మరీ వచ్చినా కనీసం నోరు మెదపలేదు.


