కూన.. అన్నీ మీకేనా..? | - | Sakshi
Sakshi News home page

కూన.. అన్నీ మీకేనా..?

Nov 20 2026 2:30 AM | Updated on Nov 20 2026 2:30 AM

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

కూన కుటుంబానికి పదవుల పంపకాలపై టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. టీడీపీలో మరో నాయకులే లేరా? పదవులన్నీ ఒక కుటుంబానికేనా? నియంతృత్వ పాలనకు ప్రోత్సహిస్తున్నా రా? కింజరాపు ఫ్యామిలీకి రెండు మంత్రి పదవులిచ్చారని స్థానిక సంస్థల పదవులతో కూన రవికుమార్‌ను సంతృప్తి పరిచారా? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.

పదవులన్నీ కూన కుటుంబ సభ్యులకే..

ఆమదాలవలస నియోజకవర్గం తెలుగుదేశం పా ర్టీలో ఇప్పుడు ‘పదవుల పంపిణీ’ పెను దుమారం రేపుతోంది. ఆమదాలవలస మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్ధిగా ఎమ్మెల్యే కూన రవికుమార్‌ సతీమణి కూన ప్రమీల పోటీ చేస్తుండగా, నియోజకవర్గంలో కీలక స్థానిక సంస్థల పీఠాలన్నీ ఒకే కుటుంబం గుప్పిట్లోకి వెళ్లిపోవడంతో టీడీపీ కేడర్‌లో అసంతృప్తి జ్వాల రగులుతోంది. ఎమ్మెల్యే రవికుమార్‌ సతీమణి కూన ప్రమీల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పోటీ చేస్తుండటం నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ఒక్క పదవితో చర్చ ఆగలేదు. అంతకుముందు ఎమ్మెల్యే కూన రవికుమార్‌ సోదరుడు సత్యనారాయణ సతీమణి సుధా రాణికి పొందూరు ఎంపీపీ కట్టబెట్టగా, ఎమ్మెల్యేకు వరసకు సోదరైన తమ్మినేని భారతమ్మకు ఆమదాలవలస ఎంపీపీ పదవీ ఇవ్వగా, ఆమదాలవలస జెడ్పీటీసీ పదవిని రవికుమార్‌ మేనకోడలు తమ్మి నేని సుజాతకు ఇచ్చారు. ఇంకా సరిపోలేదని కూన రవికుమార్‌ కుటుంబ సభ్యులైన తమ్మినేని గీతాసాగర్‌, మొదలవలస హరిప్రియలను కౌన్సిలర్లుగా పోటీ చేయిస్తుండగా, తన స్వగ్రామం పెనుబర్తి సర్పంచ్‌గా కూడా కుటుంబ సభ్యులనే నిలబెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

అవినీతికి అవకాశం ఉండదా?

పదవులన్నీ వారివే. ఏ నిర్ణయమైనా వారే తీసుకోవాలి. కాంట్రాక్టులైనా, ఇతరత్రా పనులేవైనా వారి కి తప్ప మరొకరికి దక్కవు. అంతా వారి కనుసన్న ల్లో నడవాల్సిందే. దీంతో నియంత పాలనకు దారి తీస్తోంది. ఇప్పటికే కూన రవికుమార్‌పై అనేక వి షయాల్లో ఆరోపణలు ఉన్నాయి. వారి సోదరుడు కాంట్రాక్టర్‌గా ఉండి లెక్కలేనన్ని పనులు చేస్తు న్నా రు. నాణ్యతకు తిలోదకాలిచ్చి ఇష్టారీతిన పనులు చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఉంటుండగానే చాలా చేసిన కూన రవికుమార్‌.. స్థాని క పదవులు కూడా వారి చేతిలో ఉంటే ఇక అడ్డు అదుపూ ఉండదని స్థానికంగా చర్చ జరుగుతోంది.

ఆమదాలవలస తమ్ముళ్లలో రగులుతున్న అసంతృప్తి జ్వాల

స్థానిక పీఠాలన్నీ కూన ఇంటికేనా అంటూ ఆవేదన

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బరిలో ఎమ్మెల్యే కూన రవి సతీమణి

ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు కూడా వారి కుటుంబ సభ్యులకే

జెండా మోసిన మాకు దక్కేది శూన్యమా

అంటూ క్యాడర్‌లో నిరాశ

ఎందరో నాయకులు... అందరికీ మొండి చేయి

నియోజకవర్గంలో సీనియర్‌ నాయకులు ఎందరో ఉన్నారు. వారిని విస్మరించి పదవులన్నీ కూన రవికుమార్‌ కుటుంబ సభ్యులకే కట్టబెట్టారు. పార్టీ కోసం కష్టపడి, జెండాను భుజా న మోసి ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు మొండి చేయి ఎదురైంది. పదవులన్నీ ఒకే కుటుంబానికి ఇస్తే.. దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన తామెందుకు అంటూ పలు వురు స్థానిక నేతలు అంతర్గత సమావేశాల్లో గళమెత్తుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement