శ్రీకాకుళం న్యూకాలనీ :
ఆలిండియా ఖోఖో చాంపియన్షిప్ పోటీలకు జిల్లాకు చెందిన గండ్రేటి చందన (పదో తరగతి), కొంతాల కావేరి (9వ తరగతి), మటమ హారిక (9వ తరగతి) ఎంపికయ్యారు. వీరు కృష్ణా జిల్లా గుడివాడలో ఈ నెల 14 నుంచి 16 వరకు జరిగిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో శ్రీకాకుళం బాలికల జిల్లా జట్టు ద్వితీయ స్థానం సాధించడంలో కీలక భూమిక పోషించారు. మరో రెండు రోజుల్లో గుజరాత్ రాష్ట్రం వడోదరలో జరగనున్న 45వ జాతీయస్థాయి ఖోఖో చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలికల జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరిని తీర్చిదిద్దిన కుమిలి లత (పీడీ, జీహెచ్ఎస్, ఇచ్ఛాపురం), కోచ్ రావిలిపుడి వెంకటరత్నంను పలువురు ప్రశంసించారు.


