ఆక్వాన్ తుఫాన్ ప్రభావం జిల్లాలో పలాస డివిజన్‌తో పాటు మిగిలిన డివిజన్‌లోని తీరప్రాంతాల్లో ప్రభావం ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ శాఖ పరంగా అప్రమత్తంగా ఉన్నట్లుగా సర్కిల్ ఎస్‌ఈ జీఎన్ ప్రసాద్ తెలియజేశారు. తీవ్ర గాలులుండే అవకాశాలున్నట్లుగా తెలియడంతో కలెక్టర్ ఆదేశాల ప్రకారం ముందుగా విద్యుత్ స్తంభాల వద్ద ఉన్న వైర్ల కింద ఉన్న భారీ చెట్ల కొమ్మలను తొలగించే పనులు చేస్తున్నామని వివరించారు. తీర ప్రాంత మండలాలైన గారతో పాటు పలు మండలాల్లో ఈ పనులను దాదాపుగా పూర్తి చేశారన్నారు. అలాగే విద్యుత్ స్తంభాలను సిద్ధం చేశామని, కండక్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కూడా సిద్ధం చేశామన్నారు. విద్యుత్ ఉద్యోగులకు సెలవులను రద్దు చేశామని తెలిపారు. –అరసవల్లి


