సహకారం..సన్నద్ధం! | - | Sakshi
Sakshi News home page

సహకారం..సన్నద్ధం!

Nov 20 2026 2:30 AM | Updated on Nov 20 2026 2:30 AM

హిరమండలం:

సహకార ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన వెంటనే పీఏసీఎస్‌ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పీఏసీఎస్‌ల వారీగా ఓటర్ల జాబితా తయారీ, రిజర్వేషన్ల ఖరారు, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు వంటి ప్రాథమిక ప్రక్రియను పూర్తిచేయాలని జిల్లా సహకార సంఘ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబరులో పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదీ పరిస్థితి...

జిల్లాలో 36 పీఏసీఎస్‌లు ఉన్నాయి. ఒక్కో సంఘంలో 13 మంది డైరెక్టర్లు ఉంటారు. వారి నుంచి ఎన్నికై న సభ్యులు అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. చివరిసారిగా 2013లో పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించారు. 2018తో ఆ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. కానీ ఎన్నికలు నిర్వహించేందుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సాహసం చేయలేదు. అప్పటికే టీడీపీ ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఉండడంతో వెనక్కి తగ్గింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పీఏసీఎస్‌లను గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది. సహకార వ్యవస్థను చక్కదిద్దింది. త్రీమెన్‌ కమిటీ సభ్యులను నియమించింది. కూటమి వచ్చిన తర్వాత కూడా త్రీమెన్‌ కమిటీ సభ్యుల నియామకం జరిగింది. అయితే సభ్యులతో ఎన్నికయ్యే పాలకవర్గాలు లేకపోవడంతో వ్యవసాయ రుణాల మంజూరు, ఎరువుల పంపిణీ, సహకార సేవల్లో పారదర్శకత లోపించింది.

ముందస్తు ఏర్పాట్లు..

ఎన్నికల ప్రక్రియపై ఎటువంటి ప్రకటన రాకపోయినా.. ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సహకార శాఖ అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. విడతల వారీగా కాకుండా అన్ని పీఏసీఎస్‌లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఏయే పీఏసీఎస్‌ల పరిధిలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? వంటి వాటిపై వివరాలు సేకరిస్తున్నారు. అటు ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ కేంద్రాలను కూడా గుర్తిస్తున్నారు.

పూర్తిగా నిర్వీర్యం..

సహకార రంగంలో పీఏసీఎస్‌ల పాత్ర కీలకం. అటువంటి పీఏసీఎస్‌లు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. ప్రారంభంలో రైతుల వద్ద రూ.10 ప్రారంభ రుసుంతో సభ్యుడిగా చేర్చుకునేవారు. వ్యవసాయ రుణాలు, ఎరువులు అందించేవారు. రైతుసేవల్లో పీఏసీఎస్‌లు తరించేవి. రానురాను ఇవి రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి. సభ్యత్వ రుసుం ఏకంగా రూ.330కు పెంచేశారు. పీఏసీఎస్‌ కార్యవర్గాల ఎన్నికలు పంచాయతీ ఎన్నికలకు మించిపోయాయి. దీంతో పీఏసీఎస్‌ల్లో అవినీతి కూడా పెరిగిపోయింది. గతంలో నాబార్డు సహకార బ్యాంకులకు రుణాలు అందించేది. అక్కడి నుంచి జిల్లా సహకార బ్యాంకులకు, ఆపై ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు రుణాలు సర్దుబాటు చేసేవారు. కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా నిర్వీర్యమైంది. డీసీసీబీ వాణిజ్య బ్యాంకులా మారి రైతుసేవలకు దూరమైంది. పీఏసీఎస్‌లు సైతం ఎన్నికలకు దూరంగా ఉండిపోవడంతో నామినేటెడ్‌ కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించేవి. ఎట్టకేలకు ఎన్నికలు జరుగుతుండడం మంచిదే అయినా.. అధికార పార్టీ ఏకపక్షంగా దక్కించుకునేందుకు ఎంతకై నా తెగిస్తుందన్నది బహిరంగ రహస్యమే.

పీఏసీఎస్‌ ఎన్నికలకు రంగం సిద్ధం

ఏర్పాట్లు చేస్తున్న సహకార శాఖ

స్థానిక ఎన్నికలు పూర్తయిన వెంటనే నోటిఫికేషన్‌

13 ఏళ్ల తరువాత కొత్త పాలకవర్గాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement